Share News

Chandrababu: జగన్ డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదు: చంద్రబాబు

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:54 PM

అనంతపురం: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా గురువారం అనంతపురం జిల్లా, రాప్తాడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటి వరకు అధికార పార్టీవాళ్లు బెదిరించారని.. కేసులు పెట్టారని.. ఇవాళ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Chandrababu: జగన్ డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదు: చంద్రబాబు

అనంతపురం: తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రజాగళం యాత్ర (Prajagalam Yatra)లో భాగంగా గురువారం అనంతపురం జిల్లా (Anantapuram Dist.), రాప్తాడు (Raptadu)లో భారీ బహిరంగ సభ (Sabha) నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటి వరకు అధికార పార్టీవాళ్లు బెదిరించారని.. కేసులు పెట్టారని.. ఇవాళ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యకర్తల ప్రాణానికి తన ప్రాణం అడ్డువేస్తానన్నారు. సీఎం జగన్ (CM jagan) సిద్ధం (Siddam) కార్యక్రమం ఫ్లాప్ షో అయిందని, డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదని ఎద్దేవా చేశారు. రాప్తాడులో ప్రజాగళం సభకు ఎటు చూసినా జనమే ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదని చంద్రబాబు విమర్శించారు. కరెంట్ ఛార్జీలు (Current charges) తగ్గిస్తానని హామీ ఇచ్చారని.. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. నెలకు రూ. 500 అదనంగా కరెంటు బిల్లు వస్తోందన్నారు. ఐదేళ్ల టీడీపీ (TDP) హయాంలో ఎప్పుడూ కరెంట్ ఛార్జీలు పెంచలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ హయాంలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి బాదుడే బాదుడని దుయ్యబట్టారు. రైతుల మోటర్లకు మీటర్లు బిగించి..రైతులకు ఉరితాడు వేశారన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 01:56 PM