SP : డ్రోన్లతో నేర నియంత్రణ: ఎస్పీ
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:25 AM
డ్రోన్లతో అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు చెక్ పెట్టాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో డ్రోన్ల ఆపరేటింగ్ కోసం ప్రత్యేకంగా 30 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. వీరందరికీ పోలీస్ కాన్ఫరెన్స హాలులో శిక్షణ ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం, గంజాయి సేవించడం, అమ్మాయిలను వేధించడం,...
అనంతపురం క్రైం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): డ్రోన్లతో అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు చెక్ పెట్టాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో డ్రోన్ల ఆపరేటింగ్ కోసం ప్రత్యేకంగా 30 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. వీరందరికీ పోలీస్ కాన్ఫరెన్స హాలులో శిక్షణ ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం, గంజాయి సేవించడం, అమ్మాయిలను వేధించడం,
పేకాట, చైన స్నాచింగ్, చోరీలు వంటి నేరాలకు పాల్పడే వారికి డ్రోన్లతో చెక్ పెట్టవచ్చని ఎస్పీ అన్నారు. డ్రోనలు 3 కి.మీ. పరిధిలో ప్రదేశాలను కవర్ చేస్తాయని, విజువల్స్ సేవ్ చేస్తాయని తెలిపారు. ప్రజలను రక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. ప్రస్తుతం 3 డ్రోన్లు ఎగురవేస్తున్నామని, త్వరలోనే జిల్లాలోని అన్ని పోలీ్‌సస్టేష్లన్ల పరిధిలో డ్రోన్లు ఎగురవేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....