Share News

TDP : తవ్వుకో.. తవ్వుకో..!

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:11 AM

ఎర్ర మట్టికోసం ప్రభుత్వ భూములను గుల్ల చేస్తున్నారు. అధికారుల అండతో చెలరేగిపోతున్నారు. గుత్తి మండల పరిధిలోని మామిళ్ళచెరువు కొండలు, ప్రభుత్వ భూముల్లో భారీ యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. వైసీపీ హయాంలో మట్టి మాఫియా దెబ్బకు మామిళ్లచెరువు కొండ కరిగిపోయింది. తామేమీ తక్కువ తినలేదన్నట్లు తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు, ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దందాకు తెరలేపారు. గుత్తి పట్టణంలోని ...

TDP : తవ్వుకో.. తవ్వుకో..!
At Mamillapalli.. Like.. Darjaga..

వైసీసీవారితో కలిసి టీడీపీ నేత దందా

రియల్‌ వెంచర్లకు మామిళ్లపల్లి కొండ మట్టి

భారీ యంత్రాలు, టిప్పర్ల వినియోగం

ఎర్ర మట్టికోసం ప్రభుత్వ భూములను గుల్ల చేస్తున్నారు. అధికారుల అండతో చెలరేగిపోతున్నారు. గుత్తి మండల పరిధిలోని మామిళ్ళచెరువు కొండలు, ప్రభుత్వ భూముల్లో భారీ యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. వైసీపీ హయాంలో మట్టి మాఫియా దెబ్బకు మామిళ్లచెరువు కొండ కరిగిపోయింది. తామేమీ తక్కువ తినలేదన్నట్లు తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు, ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దందాకు తెరలేపారు. గుత్తి పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ఎక్స్‌కవేటర్‌తో మామిళ్లచెరువు కొండ ప్రాంతంలో భారీగా ఎర్రమట్టిని తవ్వుతున్నారు. టిప్పర్లతో గుత్తి పట్టణ శివారు ప్రాంతాలలో రియల్‌ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇద్దరు వైసీపీ నాయకులను సైతం టీడీపీ చోటా నాయకుడు కలుపుకోవడం గమనార్హం. వైసీపీకి చెందిన


మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులలో ఒకరి పొలానికి ఈ మట్టిని తరలిస్తున్నారు. అందులో రియల్‌ వెంచర్‌ ఏర్పాటు దిశగా పనులు సాగుతున్నాయి. అధికార పక్షం, విపక్షం అన్న తేడా లేకుండా నాయకులు కలిసిమెలిసి మట్టి దందా చేయడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎర్రమట్టి టిప్పరు రూ.4 వేల నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. రోజూ రూ.లక్షల్లో దందా సాగుతోంది. మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. వైసీపీ హయాంలో గుత్తి శివారు ప్రాంతంలోని గుట్టలను కరగదీసి మట్టిని అమ్మేశారు. ఆ తరువాత చదును చేసి ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. ప్రభుత్వం మారినా.. పద్ధతి మారకపోవడం సరికాదని ప్రజలు అంటున్నారు. ఇలా అయితే తాము వేసిన ఓట్లకు విలువ ఏముంటుందని నిట్టూరుస్తున్నారు. మామిళ్లపల్లి వద్ద మట్టి తవ్వకాలకు అనుమతి లేదని, అక్కడ మట్టి తవ్వకాలకు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దారు ఓబులేసు హెచ్చరించారు.

- గుత్తి రూరల్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 13 , 2024 | 12:11 AM