Share News

Free hold: చుక్కలు కనబడుతున్నాయ్‌!

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:40 AM

రిజిస్ట్రేషన అయిన ఫ్రీహోల్డ్‌ భూములు, నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాల పునః పరిశీలన సాగుతోంది. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన పరిధిలో వీటి దందా భారీగా సాగింది. ఈ కారణంగా మొత్తం 3,203 మంది యజమానులకు చెందిన 12,393 ఎకరాలను 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వ భూముల దోపిడీ అడ్డు అదుపులేకుండా సాగింది. వీటిని వెలికితీసే పనిలో ...

Free hold: చుక్కలు కనబడుతున్నాయ్‌!
Kalyanadurgam RDO Office

వైసీపీ హయాంలో భారీగా అక్రమాలు..

డబ్బులు తీసుకుని ఇష్టారాజ్యంగా రిజిసే్ట్రషనలు

ఫ్రీ హోల్డ్‌, నిషేధిత, ప్రభుత్వ భూములతో దందా

ఇంటి పట్టాలను అమ్ముకున్న వైసీపీ నాయకులు

అప్పటి మంత్రి ఉష శ్రీచరణ్‌ కనుసన్నల్లో మాయ

అక్రమాల నిగ్గుతేల్చే పనిలో ప్రభుత్వ యంత్రాంగం

కళ్యాణదుర్గం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి):

రిజిస్ట్రేషన అయిన ఫ్రీహోల్డ్‌ భూములు, నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాల పునః పరిశీలన సాగుతోంది. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన పరిధిలో వీటి దందా భారీగా సాగింది. ఈ కారణంగా మొత్తం 3,203 మంది యజమానులకు చెందిన 12,393 ఎకరాలను 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వ భూముల దోపిడీ అడ్డు అదుపులేకుండా సాగింది. వీటిని వెలికితీసే పనిలో


కూటమి ప్రభుత్వం నిమగ్నమైంది. గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారు, ఎన్ని ఎకరాల చుక్కల భూములను చక్కబెట్టారు, నిషేధిత జాబితా నుంచి ఎంత తొలగించారనే వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తోంది.

ఇంటి స్థలాలతో మొదలు..

వైసీపీ హయాంలో పేదలకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ నుంచే దోపిడీ ప్రారంభమైంది. కంబదూరు, కళ్యాణదుర్గంలో పనిచేసిన తహసీల్దార్లకు వైసీపీ నాయకులు డబ్బులు ఇచ్చి.. ప్రైవేటు వ్యక్తుల పేరిట పట్టాలు రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇళ్ల పట్టాలను కొట్టేసి విక్రయించారు. వచ్చిన డబ్బును పంచుకున్నారు. ఈ రెండు మండలాల్లో 22ఏ జాబితాలో ఉన్న భూములపై అప్పట్లో వైసీపీ నాయకుల కన్ను పడింది. మంత్రి ఉష శ్రీచరణ్‌ కనుసన్నల్లో అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన చేయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అడిగినంత డబ్బు ఇస్తే ఎటువంటి ఆధారాలు లేకున్నా నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించారు. కొందరు నేతలు సెటిల్‌మెంట్‌ భూములను 22ఏలోకి చేర్పించి, భూ యజమానులను ముప్పతిప్పలు పెట్టారు. ముక్కుపిండి వసూలు చేశారు. నియోజకవర్గంలో చుక్కల భూముల సమస్యలను పరిష్కరించేందుకు భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆ భూములపై ఆరా..

సీసీఎల్‌ఏ అధికారులు ప్రధానంగా 22ఏ, చుక్కల భూముల నుంచి ఎన్ని ఎకరాలు తొలగించారనే వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ, డీకేటీ భూముల్లో ఎన్ని ఎకరాలకు పట్టాలు ఇచ్చారు, ఫ్రీహోల్డ్‌గా ఎంత చేశారు, మాజీ సైనికులకు ఎంత భూమి ఇచ్చారన్న వివరాలను సేకరిస్తున్నారు. వీటితో పాటు వ్యవసాయేతర భూమిగా ఎంత విస్తీర్ణాన్ని మార్చారో.. ప్రతి మండలం నుంచి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. 2019 నుంచి 2024 జూలై 23 వరకు ఉన్న వివరాలను కోరినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిలో జగనన్న కాలనీలకు ఎంత ఇచ్చారు, ఇతర అవసరాలకు ఎంత కేటాయించారో కూడా ప్రభుత్వ యంత్రాంగం ఆరా తీస్తోంది. ముఖ్యంగా చుక్కల భూమి వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.

నాటి మంత్రి దందా

చుక్కల భూముల వ్యవహారంలో అప్పటి మంత్రి ఉష శ్రీచరణ్‌ పెత్తనమే సాగింది. తాను చెప్పిన విధంగానే పనిచేసే తహసీల్దార్లును ఆమె నియమించుకున్నారు. వేల ఎకరాలను రిజిస్ట్రేషన చేయించి, లక్షలాది రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చుక్కల భూముల దందాపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉష శ్రీచరణ్‌ అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐదేళ్ల భూదోపిడీ అధికారుల విచారణలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. దీంతో ఉష శ్రీచరణ్‌ మాటలకు తలూపిన అధికారులకు గుబులు పట్టుకుంది. మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఆర్‌ఐ ఈ భూముల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆర్‌ఐ సహకారంతోనే చుక్కల భూముల అక్రమాలను ఉష శ్రీచరణ్‌ చక్కబెట్టారని అంటున్నారు. ఇవన్నీ అధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి.

డబ్బులిస్తే దర్జాగా రిజిసే్ట్రషన

వైసీపీ పాలనలో కళ్యాణదుర్గం సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. డబ్బులు తీసుకుని చుక్కల భూములను దర్జాగా రిజిస్ట్రేషన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి మంత్రి ఉషశ్రీచరణ్‌ కనుసన్నల్లోనే సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయమంతా పనిచేసింది. అప్పటి సబ్‌ రిజిసా్ట్రర్‌ ఉష శ్రీచరణ్‌కు తొత్తుగా వ్యవహరించారని, ఆమె చెప్పిందే వేదంగా భావించి చుక్కల భూములను రిజిస్ట్రేషన చేశారని ప్రచారం జరిగింది. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం నుంచి వచ్చిన అక్రమ ఆదాయాన్ని ప్రతి రోజు వాటాలు వేసుకునేవారని తెలిసింది. తాజాగా జరుగుతున్న పరిశీలనలో ఇవన్నీ బటయకు వస్తాయని అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 06 , 2024 | 12:40 AM