Share News

Ycp : వైసీపీ నీడలో విద్యాశాఖ

ABN , Publish Date - Sep 04 , 2024 | 12:22 AM

ట్వంటీ ఇయర్స్‌ బ్యాక్‌.. సేమ్‌ కార్డ్స్‌ ప్రింటెడ్‌.. నేమ్స్‌ డిఫరెంట్‌. టూ వీక్స్‌ హ్యాపీస్‌..! దెన స్టార్టెడ్‌ స్ట్రగుల్‌..! నేమ్‌ డిలీటెడ్‌..’ ఈ డైలాగ్‌ గుర్తుందా..? మనీ సినిమాలో పెళ్లి గురించి కోటా శ్రీనివాసరావు చెబుతారు. అచ్చం ఇలాంటిదే. కానీ పెళ్లి కాదు. గురు పూజోత్సవం. విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్డ్స్‌ ప్రింటెడ్‌..! దెన వెన్యూ చేంజ్‌డ్‌..! అగెయిన కార్డ్స్‌ ...

Ycp : వైసీపీ నీడలో విద్యాశాఖ
A card printed saying Guru Pujotsavam at Arts College Drama Hall

నిర్ణయాల్లో గందరగోళం

టీచర్స్‌ డే వేదిక ఎంపికే నిదర్శనం

జడ్పీ హాల్‌ అన్నట్లు ఆహ్వాన పత్రికలు

తాజాగా ఆర్ట్స్‌ కాలేజీ డ్రామా హాల్‌కు మార్పు

అనంతపురం విద్య, సెప్టెంబరు 3: ‘ట్వంటీ ఇయర్స్‌ బ్యాక్‌.. సేమ్‌ కార్డ్స్‌ ప్రింటెడ్‌.. నేమ్స్‌ డిఫరెంట్‌. టూ వీక్స్‌ హ్యాపీస్‌..! దెన స్టార్టెడ్‌ స్ట్రగుల్‌..! నేమ్‌ డిలీటెడ్‌..’ ఈ డైలాగ్‌ గుర్తుందా..? మనీ సినిమాలో పెళ్లి గురించి కోటా శ్రీనివాసరావు చెబుతారు. అచ్చం ఇలాంటిదే. కానీ పెళ్లి కాదు. గురు పూజోత్సవం. విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్డ్స్‌ ప్రింటెడ్‌..! దెన వెన్యూ చేంజ్‌డ్‌..! అగెయిన కార్డ్స్‌ ప్రింటెండ్‌..! ఇలా సాగుతోంది వ్యవహారం. విద్యాశాఖ జిల్లా అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ శాఖను అభాసుపాలు చేస్తున్నాయి. ఎక్కడైనా వేదికను ఖరారు చేసుకున్నాక ఆహ్వాన పత్రికలను ముద్రిస్తారు. జిల్లా విద్యాశాఖలో ఆహ్వాన పత్రికను ముద్రించి.. ప్రచారం చేసి.. ఆ తరువాత వేదికను మార్చుకున్నారు. తాజాగా కొత్త కార్డులను ముద్రించారు. ప్రతి సంవత్సరం


సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేసి సత్కరిస్తుంటారు. ఈ ఏడాది కూడా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. డీఈఓ కార్యాలయంలోని ఒకరిద్దరు అధికారులు, పలువురు ఉపాధ్యాయులు దీని గురించి చర్చించుకున్నారు. వేదిక కోసం ఆర్ట్స్‌ కాలేజీని పరిశీలించారు. ఆ తరువాత జడ్పీలోని డీపీఆర్సీ మీటింగ్‌ హాల్‌ను ఎంపిక చేసుకున్నారు. మంత్రులు, కలెక్టర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులకు ఇచ్చే ఆహ్వాన పత్రికలను ముద్రించారు. ఆ తరువాత వేదిక సరిపోదు అనుకున్నారు. మొదట చూసిన ఆర్ట్స్‌ కాలేజీలో వేడుక నిర్వహించాలని నిర్ణయించారు.

వైసీపీవారి కుయుక్తులు..?

ఉపాధ్యాయ దినోత్సవం విషయంలో గందరగోళం వెనుక వైసీపీ మద్దతుదారులైన కొందరు ఉపాధ్యాయుల కుయుక్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జడ్పీ మీటింగ్‌ హాల్‌ చాలా చిన్నది. అవార్డులు తీసుకునే టీచర్లు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, అవార్డు కమిటీ సభ్యులు.. అందరూ కలిసి 500 మందికిపైగా వస్తారు. వందమంది కూడా పట్టని జడ్పీ హాల్‌ను వేడుకలకు ఎంపిక చేయించి.. కార్యక్రమాన్ని చెడగొట్టాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ నీడలో నడిచే ఉపాధ్యాయులు, అనుభవం లేని కొందరు టీచర్లు, ప్రధానోపాధాయులు పెద్దమనుషుల అవతారం ఎత్తి.. డీఈఓ చేత పొరపాటు చేయించారని సమాచారం. ఆహ్వాన పత్రికలు సిద్ధం కాగానే వైసీపీ బ్యాచ ఉపాధ్యాయులు సోషల్‌ మీడియాలో ముమ్మరంగా పోస్టు చేశారు.

మళ్లీ డ్రామా హాల్‌కు..

జడ్పీలో వేడుక నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని ఆప్టా, ఎస్టీయూ, యూటీఎఫ్‌, ఎన్టీఏ తదితర సంఘాల నేతలు విద్యాశాఖ అధికారులకు అభ్యంతరం తెలిపారు. ప్రతి సంవత్సరం ఆర్ట్స్‌ కాలేజీ డ్రామా హాల్‌లోనే వేడుకలు నిర్వహిస్తారని డీఈఓకు గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు వెంకటరట్నం, బండారు శంకర్‌, చల్లా ఓబులేసు, రామాంజినేయులు, కోటేశ్వర్‌రావు, రామాంజినేయులు, భుక్త్యానాయక్‌, రామాంజినేయులు, తదితరులు ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ను కలిశారు. వేడుకకు అనుమతి ఇవ్వాలని కోరి.. వినతిపత్రం ఇచ్చి ఓప్పించారు. ప్రిన్సిపాల్‌ అంగీకారం తెలుపడంతో రుసుం చెల్లించారు. ఫైనల్‌గా ఆర్ట్స్‌ కాలేజీ డ్రామా హాల్‌లో గురుపూజోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త వేదిక పేరుతో కార్డులు ముద్రించి, ముఖ్య అతిథులను, అతిథులను ఆహ్వానించారు. ప్రభుత్వం మారినా విద్యాశాఖలో వైసీపీ మద్దతు టీచర్ల హవా నడుస్తోందని, అందుకే గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని పలువురు ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 04 , 2024 | 12:22 AM