Share News

Farmers: అనంతలో రైతుల ఆందోళన.. కారణమిదే!

ABN , Publish Date - Aug 20 , 2024 | 12:01 PM

Andhrapradesh: జిల్లాలోని కక్కలపల్లి మార్కెట్‌లో సీఆర్పీ మండిని రైతులు ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. మండి అసోసియేషన్ అధ్యక్షుడినంటూ సీఎంఆర్ మండీ నిర్వాహకుడు అమర్నాథ్ అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డాడు. వ్యాపారస్థులను టమోటా ఆక్షన్ వేయకుండా బెదరింపులకు గురిచేయడంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Farmers: అనంతలో రైతుల ఆందోళన.. కారణమిదే!
Anantapur Farmers

అనంతపురం, ఆగస్టు 20: జిల్లాలోని కక్కలపల్లి మార్కెట్‌లో సీఆర్పీ మండిని రైతులు (Farmers) ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. మండి అసోసియేషన్ అధ్యక్షుడినంటూ సీఎంఆర్ మండీ నిర్వాహకుడు అమర్నాథ్ అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డాడు. వ్యాపారస్థులను టమోటా ఆక్షన్ వేయకుండా బెదరింపులకు గురిచేయడంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళన విషయం తెలిసిన వెంటనే పోలీసులు మండి వద్దకు చేరుకున్నారు.

MLC Kavitha: కవితకు మళ్లీ షాక్.. బెయిల్ విషయంలో పదే పదే నిరాశ..


వ్యాపారస్థులు, మండి యజమానులతో పోలీసులు చర్చలు నిర్వహించారు. టమోటా మార్కెట్‌లో మండి అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులుగా సీఆర్పీ మండి నిర్వాహకుడు అమర్నాథ్, ఏఎన్ఆర్ మండి నిర్వాహకుడు గురు, 7 హిల్స్ మండి నిర్వాహకుడు పేపర్ సీన, ది అనంతపురం లారీ అసోసియేషన్ నాయకుడు నీలకంఠ నాయుడులతో పోలీసులు చర్చలు నిర్వహించారు.


కాగా... అనంతపురం మార్కెట్‌లో టమాటా మాఫియాపై రైతులు మండిపడ్డారు. మండీ అసోసియేషన్ పేరుతో రైతులపై రౌడీయిజం ప్రదర్శించారు. అసోసియేషన్ బెదరింపులతో టమాటా వేలాన్ని బయ్యర్లు నిలిపివేశారు. రైతులతో కలిసి హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై బయ్యర్లు బైఠాయించారు. ఒక్కో వాహనానికి రూ. 3 వేలు మండి అసోసియేషన్ వసూలు చేస్తోంది. కప్పం కట్టని వాహనాలు, రికార్డులను మండి అసోసియేషన్ లాక్కుంటోంది. మండీ అసోసియేషన్ తీరుతో రైతులు, బయ్యర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. సమస్య ఓ కొలిక్కి రాకపోవడంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిని టమాటా రైతులు దిగ్బంధించింది. లారీ అసోసియేషన్, మండీ అసోసియేషన్ దందాలను అరికట్టాలని జాతీయ రహదారిపై బైఠాయించారు.

Congress VS BRS: రాజీవ్‌గాంధీ విగ్రహం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రభస


జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లారీ అసోసియేషన్, మండి అసోసియేషన్ పేరుతో వ్యాపారస్తులను బెదిరింపులకు గురి చేస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారస్తుల లారీలు మార్కెట్లోకి రాకుండా లారీ అసోసియేషన్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బు ఇస్తేనే బయ్యర్లకు మండీల్లోకి అనుమతిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారికి పోలీసులు వత్తాసు పలకడంపై రైతులు మండిపడ్డారు. టమాటా బాక్సులను కొనుగోలు చేసే వ్యాపారస్తులు లేక నో సెల్ పడటంతో రైతులు ఆత్మహత్యే శరణం అంటున్నారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ దొంగ తెలివితేటలకు షాకవ్వాల్సిందే.. లోపలికి రాకుండా ఏటీఎమ్‌ను ఎలా లూటీ చేశాడో చూడండి..!

Pawan: ఏపీలో ఒకేరోజు పెద్దసంఖ్యలో గ్రామాసభలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 20 , 2024 | 12:08 PM