Share News

Rain Effect : చివరికి కన్నీరే

ABN , Publish Date - Dec 04 , 2024 | 12:35 AM

చేతికొచ్చిన వరి పంట తుఫాన దెబ్బకు నేలకొరిగింది. మండలంలోని ఉద్దేహాళ్‌, ఉంతకల్లు క్రాస్‌, దేవగిరిక్రాస్‌, రంగాపురం క్యాంప్‌, లింగదహాళ్‌, శ్రీధరఘట్ట తదితర గ్రామాలలో తుఫాన వర్షానికి వరిపంట నేలకొరిగింది. మండలంలోని పలు గ్రామాలలో ఈదురుగాలులతో సోమవారం రాత్రి వర్షం కురిసింది. దీంతో దాదాపు 150 ఎకరాలకు పైగా వరిపంటకు నష్టం వాటిల్లింది. అధిక ధర చెల్లించి, విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన పంటను తుఫాన దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం ...

Rain Effect : చివరికి కన్నీరే
Uprooted paddy field near Uddehal village

తుఫాన దెబ్బకు నేలకొరిగిన వరి పైరు

చేతికొచ్చిన పంట నేలపాలు

బొమ్మనహాళ్‌(ఆంధ్రజ్యోతి): చేతికొచ్చిన వరి పంట తుఫాన దెబ్బకు నేలకొరిగింది. మండలంలోని ఉద్దేహాళ్‌, ఉంతకల్లు క్రాస్‌, దేవగిరిక్రాస్‌, రంగాపురం క్యాంప్‌, లింగదహాళ్‌, శ్రీధరఘట్ట తదితర గ్రామాలలో తుఫాన వర్షానికి వరిపంట నేలకొరిగింది. మండలంలోని పలు గ్రామాలలో ఈదురుగాలులతో సోమవారం రాత్రి వర్షం కురిసింది. దీంతో దాదాపు 150 ఎకరాలకు పైగా వరిపంటకు నష్టం వాటిల్లింది. అధిక ధర చెల్లించి, విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన పంటను తుఫాన దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం


చేస్తున్నారు. గత రెండురోజులుగా కొద్దిపాటి వర్షం పడి గాలి భారీగా వీచడంతో పంట నేలకొరిగిందన్నారు. ధాన్యం గింజలు భారం ఎక్కువై తడిసిన పైరు నేలకొరిగిందని రైతులు అన్నారు. ఈ ఏడాది ఎకరానికి 40 బస్తాలకుపైగా దిగుబడి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు చివరికి నిరాశే మిగిలింది. పైరు నిలువుగా ఉంటే ఎకరా కోతకు 1:25 గంటలు పట్టేదని నేలకు ఒరిగిన పైరు కోయడానికి మూడు గంటల సమయం పడుతుందని, ఇది అదనపు భారమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తొమ్మిది ఎకరాలు నేలపాలు: ఎర్రిస్వామి, రైతు, శ్రీధరఘట్ట

ఈ ఏడాది ఖరీ్‌ఫలో నా సొంత భూమి రెండు ఎకరాలు, కౌలు భూమి ఏడెకరాల్లో వరిపంట సాగు చేశా. ఆది, సోమవారాలలో కొద్దిపాటి వర్షానికి, వీచిన గాలికి వరి పైరు మొత్తం నేలకు ఒరిగిపోయింది. వారంరోజుల్లో ధాన్యం ఇంటికి చేరుతాయని ఆశించా. గతంలో చేసిన అప్పులు, ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు తీరుతాయని, నా భూమికి తోడు మరింత భూమి కౌలుకు తీసుకుని సాగుచేస్తే నేలపాలై మరింత అప్పును మిగిల్చింది.

అప్పులు ఎలా తీర్చాలో?: సంజీవ, రైతు, లింగదహాళ్‌

నాకున్న రెండెకరాల భూమిలో వరిపంట సాగుచేశా. చేతికి వచ్చిన పంట నేలకొరిగిపోయింది. వరిపంట బాగా పండి కోతకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో కొద్దిపాటి వర్షానికి, భారీగా గాలి వీచి పంట మొత్తం నాశనమైపోయింది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో ఆందోళనగా ఉంది. కొద్దిపా టి చినుకులకు, వీచిన గాలికి కోతదశలో నష్టాన్ని మిగిల్చింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 04 , 2024 | 12:35 AM