Share News

YCP, TDP : అక్రమాల్లో పోటీ!

ABN , Publish Date - Sep 18 , 2024 | 12:42 AM

ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. ఈక్రమంలోనే ఒకరి ట్రాక్టర్లను మరొకరు పట్టుకుంటున్నారు. వారంరోజుల కిందట కరకముక్కల గ్రామానికి చెందిన రెండు ఇసుక ట్రాక్టర్లు విడపనకల్లుకు వచ్చాయి. వాటి విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు విడపనకల్లు ఎస్‌ఐ ఖాజా హుస్సేనకు సమాచారం ఇచ్చారు. దీంతో వాటిని పట్టుకుని స్టేషనకు తరలించారు. కరకముక్కల టీడీపీ నాయకులు రంగంలోకి ...

YCP, TDP : అక్రమాల్లో పోటీ!
A sand tractor was caught by the TDP leaders from the enemy faction in the middle of the night

ఇసుక అక్రమ రవాణాకు టీడీపీ నాయకుల పోటాపోటీ

పోలీస్‌ స్టేషనకు చేరుతున్న పంచాయితీ

విడపనకల్లు, సెప్టెంబరు 17: ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. ఈక్రమంలోనే ఒకరి ట్రాక్టర్లను మరొకరు పట్టుకుంటున్నారు. వారంరోజుల కిందట కరకముక్కల గ్రామానికి చెందిన రెండు ఇసుక ట్రాక్టర్లు విడపనకల్లుకు వచ్చాయి. వాటి విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు విడపనకల్లు ఎస్‌ఐ ఖాజా హుస్సేనకు సమాచారం ఇచ్చారు. దీంతో వాటిని పట్టుకుని స్టేషనకు తరలించారు. కరకముక్కల టీడీపీ నాయకులు రంగంలోకి దిగి, తాము కూడా టీడీపీకి పని చేశామని, తమ ట్రాక్టర్లను కూడా పట్టిస్తారా అంటూ విడపనకల్లు నాయకులతో ఘర్షణకు దిగారు. స్టేషనలో పంచాయితీ పెట్టి రూ.30వేలు ఇస్తాము ట్రాక్టర్లను వదిలేయాలని చర్చలు జరిపారు. అయితే


ఆమాటలు వినని పోలీసులు రాత్రికి రాత్రే కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు విడపనకల్లుకు చెందిన రెండు ఇసుక ట్రాక్టర్లు అర్ధరాత్రి సమయంలో వచ్చాయి. కాపుకాచిన కొంతమంది టీడీపీ నాయకులు ఆ ట్రాక్టర్లను పట్టుకుని విడపనకల్లు ఎస్‌ఐకి సమాచారం అందించా రు. రెండు ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఉంటే వాటిని పట్టుకున్నామనీ, స్టేషనకు తరలించి కేసు నమోదు చేయాలని తెలిపినా ఎస్‌ఐ స్పందించలేదని టీడీపీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వర్గం వారు చెబితే ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటారనీ, అదే వర్గం వారు అక్రమ ఇసుక రవాణా చేస్తే పట్టించు కోరా అంటూ విడపనకల్లు ఎస్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్లను వదలకుండా అందులోని ఇసుకను మండల కేంద్రంలోని అమ్మవారి దేవాలయం ముందు వేయించారు. వైరి వర్గం టీడీపీ నేతలు రెండు రోజులు మిన్నకుండి మూడో రోజు రాత్రికి రాత్రే ఆ ఇసుకను మాయం చేశారు. బొమ్మనహాళ్‌ మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు విడపనకల్లు మండలానికి చెందిన నాయకుడికి నెలకు రూ.లక్ష ఇస్తాననీ, ఇసుకను విడపనకల్లు మండలానికి రవాణా చేస్తానని చర్చలు జరిపినట్లు సమాచారం.

బహిరంగంగా సబ్సిడీ బియ్యం సేకరణ

మండలంలోని వివిధ గ్రామాల్లో సబ్సిడీ బియ్యాన్ని టీడీపీ నాయకులు బహిరంగంగానే సేకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి కనీసం ఆరు మాసాలు కూడా కాకుండానే టీడీపీ నాయకులు అక్రమ వ్యాపారాలకు తెర లేపటంపై కొంత మంది టీడీపీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా కొందరి వ్యవహార శైలి ఉందని విమర్శిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కర్ణాటక మద్యం వ్యాపారం, మట్కా, పేకాటను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 18 , 2024 | 12:42 AM