Share News

Ycp, Tdp : మట్టి దోపిడీ

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:06 AM

అధికారం అండగా వైసీపీ నాయకులు చెలరేగిపోయారు. వాగు, వంక అన్న తేడా లేకుండా ఎర్రమట్టి కొల్లగొట్టారు. అధికారం కోల్పోయి, కూటమి ప్రభుత్వం కొలువుదీరినా మార్పు రాలేదు. ఎర్ర మట్టి మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. బుక్కరాయసముద్రం మండలంలో పట్టపగలే పచ్చని కొండలను పిండి చేస్తున్నారు. ప్రభుత్వానికి పైసా సుంకం చెల్లించడం లేదు. అనుమతులు తీసుకోలేదు. కొంత మంది టీడీపీ నాయకులు, మైనింగ్‌, ఇతర శాఖల అధికారులతో కుమ్మక్కై.. ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వేస్తున్నారు. ..

Ycp, Tdp : మట్టి దోపిడీ
Daiyalakantapalli is located at the back of Peddakonda The scene of digging the hill and moving the red soil

పచ్చటి కొండలు కనుమరుగు

భారీ యంత్రాలతో తవ్వకాలు

టిప్పర్లలో తరలించి విక్రయం

బుక్కరాయసముద్రం, అక్టోబరు 1:

అధికారం అండగా వైసీపీ నాయకులు చెలరేగిపోయారు. వాగు, వంక అన్న తేడా లేకుండా ఎర్రమట్టి కొల్లగొట్టారు. అధికారం కోల్పోయి, కూటమి ప్రభుత్వం కొలువుదీరినా మార్పు రాలేదు. ఎర్ర మట్టి మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. బుక్కరాయసముద్రం మండలంలో పట్టపగలే పచ్చని కొండలను పిండి చేస్తున్నారు. ప్రభుత్వానికి పైసా సుంకం చెల్లించడం లేదు. అనుమతులు తీసుకోలేదు. కొంత మంది టీడీపీ నాయకులు, మైనింగ్‌, ఇతర శాఖల అధికారులతో కుమ్మక్కై.. ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వేస్తున్నారు. దయ్యాలకుంటపల్లి వద్ద నెల రోజులుగా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా యంత్రాలతో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. వరుసగా వస్తున్న


లారీ టిప్పర్లను చూసి ‘ఏమబ్బా..! ఇక్కడ ఏమన్నా ఫ్యాక్టరీ కడుతున్నారా?’ అని రైతులు అనుకున్నారు. పచ్చని కొండలను తవ్వి పశువులకు గడ్డి లేకుండా చేస్తున్నారని గుర్తించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో దందా జరుగుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది.

కొండలు పిండి

దయ్యాలకుంటపల్లిలోని నక్కలగుట్ట, పెద్దకొండ, మరో పచ్చని కొండపై ఎర్ర మట్టి మాఫియా కన్నుపడింది. భారీ యంత్రాలను తెచ్చి కొండలను కొల్లగొడుతున్నారు. నిత్యం వందలాది టిప్పర్లతో ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. టిప్పరు మట్టి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తున్నారు. అక్రమార్కులు రూ.లక్షలు గడిస్తున్నారు. మైనింగ్‌ అధికారులతో అనుమతులు తీసుకోకనే విలువైన గ్రావెల్‌ తరలిస్తున్నారు.

రైతులకు బెదిరింపు

కొండలను పిండి చేసి అక్రమంగా మట్టిని తరలిస్తున్న మాఫియా.. ఆ ప్రాంత రైతులను బెదిరిస్తోంది. కొండ ను తవ్వడానికి ఎవరు అనుమతి ఇచ్చారని స్థానిక రైతులు అడిగితే... మైనింగ్‌, రెవెన్యూ అధికారులు అనుమతి ఇచ్చారని చెబుతున్నారు. ‘ఇక్కడి టీడీపీ నాయకులతో మాట్లాడుకున్నాం. మీకు ఎందుకు? మీ పని చూసుకోండి’ అని బెదిరిస్తున్నారని తెలిసింది. మైనింగ్‌ శాఖ నుంచి తాత్కాలిక అనుమతి తీసుకుని, పర్మినెంట్‌గా దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు మండలంలోని వివిధ ప్రాంతాలలో దాడులు నిర్వహించి.. ఇసుక, మట్టి ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. కానీ కళ్లెదుట తిరుగుతున్న ఎర్రమట్టి టిప్పర్లను మాత్రం పట్టుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

చర్యలు తీసుకోండి..

గడిచిన ఐదేళ్లు వైసీపీ నాయకులు కొండలను తవ్వి రూ.కోట్లు గడించారు. ప్రస్తుతం మండలంలో వైసీపీ, టీడీపీ నాయకులు కుమ్మకై సహజ వనరులును దోచుకుంటున్నారు. అనంతపురం నగరానికి చెందిన ఎర్రమట్టి మాఫియా బరి తెగిస్తుంటే రెవెన్యూ, పోలీసులు, మైనింగ్‌ అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు. వెంటనే ఎర్రమట్టి అక్రమ తవ్వకాలను ఆపకపోతే ఆందోళన చేస్తాం. -నారాయణస్వామి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి

అనుమతి ఇవ్వలేదు..

మండలంలో ఎర్రమట్టిని తరలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. రైతులు కూడా తమ పట్టా భూముల్లో మట్టిని తరలించుకుంటామని మా వద్దకు రాలేదు. దయ్యాలకుంటపల్లి వద్ద కొండలు తవ్వి ఎర్రమట్టి తరలించే వారిపై చర్యలు తప్పవు.

-పుణ్యవతి, తహసీల్దారు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Oct 02 , 2024 | 12:06 AM