Share News

Roads : దారి కోసం డబ్బులు..!

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:17 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో శిథిలమైన రహదారులను బాగు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులపై దృష్టిసారించింది. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌ సమీక్షలు నిర్వహించి, జిల్లాల వారీగా నివేదికలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా (రాష్ట్ర రహదారులు, జిల్లా మేజర్‌ రోడ్లు) 68 పనులకు ప్రతిపాదనలు పంపారు. మొత్తం 383 కి.మీ. మేర రోడ్లు గుంతలమయమైనట్లు గుర్తించారు. మరమ్మతులకు ...

Roads : దారి కోసం డబ్బులు..!
Damajipalli - Tadiparti road

గుంతలను పూడ్చేందుకు రూ.19.92 కోట్లు

అధికారులు అడిగినంత సొమ్ము ఇచ్చిన ప్రభుత్వం

వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశం

ఉత్సాహంగా సాగుతున్న టెండరు ప్రక్రియ

అనంతపురం సిటీ, సెప్టెంబరు 26: వైసీపీ ఐదేళ్ల పాలనలో శిథిలమైన రహదారులను బాగు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులపై దృష్టిసారించింది. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌ సమీక్షలు నిర్వహించి, జిల్లాల వారీగా నివేదికలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా (రాష్ట్ర రహదారులు, జిల్లా మేజర్‌ రోడ్లు) 68 పనులకు ప్రతిపాదనలు పంపారు. మొత్తం 383 కి.మీ. మేర రోడ్లు గుంతలమయమైనట్లు గుర్తించారు. మరమ్మతులకు రూ19.92 కోట్లు కావాలలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆ వెంటనే ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి) కింద రూ.19.92 కోట్లు విడుదల


చేసింది. వంద రోజుల్లో ఈ పనులను పూర్తి చేయాలని అదేశించింది.

అడిగినంత ఇచ్చారు..

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. అధికారులు అంచనా నివేదిక పంపితే అందులో కొంత కోసిగానీ ఇవ్వవు. ఒక్కోసారి మొండిచేయి చూపుతాయి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారులు అడిగినంత మొత్తాన్ని ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 383 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు రూ.19.92 కోట్లు అవసరమని అధికారులు జూలైలో నివేదించారు. ఇందులో పైసా కూడా తగ్గించకుండా వందశాతం నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు కేటాయించిన నిధులలో అనంతపురం జిల్లాకు 39 పనులకు (269 కి.మీ.) రూ.13.92 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 29 పనులకు (114 కి.మీ.) రూ.6 కోట్లు కేటాయించింది. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో పనులను పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో రెండు జిల్లాల ఆర్‌అండ్‌బీ అధికారులు పనులపై దృష్టి సారించారు. ఇప్పటికే టెండర్లను పిలిచారు. కాంట్రాక్టర్లు పనులను దక్కించుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

ఐదేళ్లు నిర్లక్ష్యం..

వైసీపీ ఐదేళ్ల పాలనలో రహదారుల గురించి పట్టించుకోలేదు. ప్రజలు అవస్థల నడుమ ప్రయాణం చేయాల్సి వచ్చింది. కొత్త రోడ్ల సంగతి అటుంచితే.. గుంతలను కూడా పూడ్చింది లేదు. ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులకు అరకొరగా నిధులు కేటాయించారు. కానీ ఎక్కడా ఆశించిన స్థాయిలో పనులు సాగలేదు. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టడమే దీనికి కారణమని కాంట్రాక్టర్లు విమర్శిస్తున్నారు. రికార్డుల ప్రకారం వైసీపీ ప్రభుత్వం రూ.100 కోట్ల వరకు బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు.

మొదలైన సందడి..

కూటమి ప్రభుత్వం నిధులను కేటాయించగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టర్లలో సందడి మొదలైంది. ఆర్‌అండ్‌బీ అధికారులు టెండరు ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఎస్‌ఈ స్థాయిలో- 10, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ (ఈఈ) స్థాయిలో 58 వర్కులు ఉన్నాయి. ఎక్కడిక్కడ టెండర్లను పిలిచారు. వైసీపీ పాలనలో విసిగిపోయిన కాంట్రాక్టర్లు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఉత్సాహంగా టెండర్లు వేస్తున్నారు.

అడిగినంత ఇచ్చారు..

ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం కోరినన్ని నిధులను మంజూరు చేసింది. ఇది శుభపరిణామం. ప్రజలకు ఎంతో ఉపయోగకరం. త్వరలో టెండర్ల పక్రియను పూర్తి చేసి, ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల్లో ఈ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

- ఓబులరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 27 , 2024 | 12:17 AM