Share News

Retired Tehsildar : అవిశ్రాంత అక్రమాలు

ABN , Publish Date - Oct 02 , 2024 | 11:56 PM

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విశ్రాంత అధికారి అక్రమ వ్యవహారాలకు అడ్డేలేకుండా పోయింది. కూట మి అధికారంలోకి వచ్చాక విశ్రాంత తహసీల్దార్లు ఎక్కడా పనిచేయకూడదని ఆదేశించింది. ఎక్కడైనా పనిచేస్తుంటే వెంటనే తొలగించాలని మూడు నెలల క్రితం ఆదేశించింది. దాదాపు జిల్లా అంతటా ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేశారు. కానీ భూగర్భగనుల శాఖలో మాత్రం అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో మైన్స అక్రమార్కులకు సహకరించిన ఓ ...

Retired Tehsildar  : అవిశ్రాంత అక్రమాలు
Retired Tehsildar Anjaneyu on duty in Mains office

మైనింగ్‌ శాఖలో వైసీపీ భక్తుడు

ప్రభుత్వం తొలగించమన్నా.. కొనసాగింపు

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 2: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విశ్రాంత అధికారి అక్రమ వ్యవహారాలకు అడ్డేలేకుండా పోయింది. కూట మి అధికారంలోకి వచ్చాక విశ్రాంత తహసీల్దార్లు ఎక్కడా పనిచేయకూడదని ఆదేశించింది. ఎక్కడైనా పనిచేస్తుంటే వెంటనే తొలగించాలని మూడు నెలల క్రితం ఆదేశించింది. దాదాపు జిల్లా అంతటా ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేశారు. కానీ భూగర్భగనుల శాఖలో మాత్రం అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో మైన్స అక్రమార్కులకు సహకరించిన ఓ విశ్రాంత తహసీల్దారును ఇంకా కొనసాగిస్తున్నారు. ఎవరి అండతో


కొనసాగుతున్నారనే చర్చ జరుగుతోంది. అమిగోస్‌ మినరల్స్‌, జేపీ వెంచర్స్‌, ప్రతిమ సంస్థలకు ఆయన పూర్తి సహకారం అందించారు. రెవెన్యూ లొసుగులను మైన్స అధికారులకు అనుకూలంగా మలచడంలో ఆయన కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

భారీగా అక్రమాలు

రాయదుర్గం తహసీల్దారుగా ఆయన నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. రెండున్నరేళ్ల క్రితం మైన్స శాఖలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన విధుల్లో చేరారు. అప్పటి మైన్స అధికారులు, వైసీపీ నేతలతో ఉన్న సాన్నిహిత్యంతో అక్రమాలకు తెరలేపారు. ఇసుక అక్రమ రవాణా, అమిగోస్‌ మినరల్స్‌ ప్రైవేటు సంస్థ అక్రమ వసూళ్లకు ఈ విశ్రాంత అధికారి అనుభవాన్ని అందించారు. దీంతో వైసీపీ నేతలు రూ.కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. అమిగో్‌సతో పాటు ఇసుక కాంట్రాక్ట్‌ పొందిన జేపీ వెంచర్స్‌, ప్రతిమ సంస్థలకు ఆయన ఊడిగం చేశారన్న తీవ్ర విమర్శలు వచ్చాయి. వైసీపీపై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకున్నారని ఆరోపణలు వచ్చాయి. జగన భజన చేసే ఆయన.. కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని సమాచారం. అమిగోస్‌ సంస్థ జిల్లాలో ఏర్పాటు చేసిన 76 చెక్‌ పోస్టులలో అక్రమ వసూళ్ళు, మైనింగ్‌ కాంట్రాక్ట్‌ లీజుదారుల నుంచి బలవంతపు జరిమానాల వసూళ్లకు పాల్పడిన ఘటనలలో ఆయనే కీలకపాత్రధారి అని ప్రచారం ఉంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 02 , 2024 | 11:56 PM