మారణకాండకు మూల్యం తప్పదు
ABN , Publish Date - Dec 05 , 2024 | 12:46 AM
హిందువులే లక్ష్యంగా బంగ్లాదేశలో సాగిస్తున్న మారణకాండకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించక తప్పదని బీజేజీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు హెచ్చరించారు. బంగ్లాదేశ తీరుకు నిరసనగా నగరంలో బుఽధవారం కాగడాల ర్యాలీ నిర్వహించారు. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీకి సందిరెడ్డి శ్రీనివాసులు హాజరై ప్రసంగించారు. బంగ్లాదేశలో రిజర్వేషన్ల విషయంపై హసీనా నాయకత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ...
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డిశ్రీనివాసులు
అనంతపురం సెంట్రల్/కల్చరల్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): హిందువులే లక్ష్యంగా బంగ్లాదేశలో సాగిస్తున్న మారణకాండకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించక తప్పదని బీజేజీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు హెచ్చరించారు. బంగ్లాదేశ తీరుకు నిరసనగా నగరంలో బుఽధవారం కాగడాల ర్యాలీ నిర్వహించారు. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీకి సందిరెడ్డి శ్రీనివాసులు హాజరై ప్రసంగించారు. బంగ్లాదేశలో రిజర్వేషన్ల విషయంపై హసీనా నాయకత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయని అన్నారు. ఈ అల్లర్లను హిందువులవైపు మరల్చేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ దేశంలోని హిందూ మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
బంగ్లాదేశను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడం నుంచి నేటి వరకు ఆ దేశ అభివృద్ధికి భారత ఎనలేని సహాయ, సహకారాలు అందిస్తోందని అన్నారు. కూర్చున్న కొమ్మను బంగ్లాదేశ నరుక్కుంటోందని, హిందువులపై దాడులకు తెగబడుతోందని అన్నారు. ఇస్కాన ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో అన్నార్థుల ఆకలిని తీరుస్తున్నారని, ఇస్కాన పూజారి చిన్మోయ్ కృష్ణదాసు ఆధ్వర్యంలో దశాబ్దాలుగా బంగ్లాదేశలో సేవలు అందిస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తిని దేశ ద్రోహిగా చిత్రీకరించడం, ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాదిని హత్యచేయడం అమానవీయమని అన్నారు. ఆ దేశాధినేత స్పందించి, హిందువులపై దాడులను ఆగేలా చూడాలని, లేదంటే తీవ్ర పరిణామలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
హిందువులు ఏకతాటిపైకి రావాలి: దేవేందర్
దాడులను అరికట్టేందుకు హిందువులు ఏకతాటిపైకి రావాలని హిందూ చైతన్య వేదిక అఖిల భారత సంయోజక్ దేవేందర్ పిలుపునిచ్చారు. జాతీయ పతాకం చేబూని ఆయన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తిప్పికొట్టేందుకు హిందువులంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు తాలంకి వెంకటరత్నమయ్య, రమణబాబు, విశ్వేశ్వర రెడ్డి, చిరంజీవి రెడ్డి, హిమకర్, విజయ్, రమణమాబు, రత్నమయ్య, జగదీష్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....