Share News

ఓటెత్తి జైకొట్టు!

ABN , Publish Date - May 13 , 2024 | 12:18 AM

ఐదేళ్ల పాలన చూశారు..! అంతకు మునుపు ఐదేళ్ల పాలనా చూశారు..! అరాచకాలకు, అభివృద్ధికి తేడాలను గమనించారు. మరో ఐదేళ్ల భవితకు పునాది వేసుకునేందుకు సిద్ధమయ్యారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో పోటెత్తి ఓటేసి.. స్పష్టమైన సంకేతాలను పంపించారు. ఈవీఎంల మీట నొక్కేందుకు మరింత ఉత్సాహంతో సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు విజేతగా నిలిచే సమయం ఆసన్నమైంది. అభ్యర్థుల భవితవ్యం అటుంచితే.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే బాధ్యత ఓటరుదే. ‘తెల్లారింది లెగండోయ్‌.. కొక్కొరోక్కో..’ అంటూ.. ఓటేసేందుకు తాము వెళ్లడంతోపాటు.. ఇరుగూ పొరుగునూ తట్టిలేపి తీసుకెళ్లాలి. పోలింగ్‌ కేంద్రాలు కళకళలాడాలి. ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. భవితను మార్చుకోవాలి. అభివృద్ధికి బాటలువేసేవారిని గురిచూసి ఎన్నుకోవాలి. ...

ఓటెత్తి జైకొట్టు!
Distribution of election materials of Rapatu constituency in junior college in Anantapur.

ఐదేళ్ల భవితకు ఓటే పునాది

నేడు జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ..

ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు

ఎన్నికల సామగ్రితో తరలిన పోలింగ్‌ సిబ్బంది

తెల్లారింది లెగండోయ్‌...

ఐదేళ్ల పాలన చూశారు..! అంతకు మునుపు ఐదేళ్ల పాలనా చూశారు..! అరాచకాలకు, అభివృద్ధికి తేడాలను గమనించారు. మరో ఐదేళ్ల భవితకు పునాది వేసుకునేందుకు సిద్ధమయ్యారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో పోటెత్తి ఓటేసి.. స్పష్టమైన సంకేతాలను పంపించారు. ఈవీఎంల మీట నొక్కేందుకు మరింత ఉత్సాహంతో సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు విజేతగా నిలిచే సమయం ఆసన్నమైంది. అభ్యర్థుల భవితవ్యం అటుంచితే.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే బాధ్యత ఓటరుదే. ‘తెల్లారింది లెగండోయ్‌.. కొక్కొరోక్కో..’ అంటూ.. ఓటేసేందుకు తాము వెళ్లడంతోపాటు.. ఇరుగూ పొరుగునూ తట్టిలేపి తీసుకెళ్లాలి. పోలింగ్‌ కేంద్రాలు కళకళలాడాలి. ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. భవితను మార్చుకోవాలి. అభివృద్ధికి బాటలువేసేవారిని గురిచూసి ఎన్నుకోవాలి.


ఊరిదావ..!

ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. ఓట్ల పండగకు పల్లె, పట్నం, నగరం సిద్ధమైంది. ఊరూరా సందడి నెలకొంది. ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన సొంతూరుకు సంక్రాంతికి వచ్చినట్లు వచ్చేశారు. ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. రద్దీకి తగినన్ని బస్సులు లేక.. చాలామంది టాప్‌పై ఎక్కి ప్రయాణించారు.

అనంతపురం/టౌన, మే 12(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల కమిషన షెడ్యూల్‌ మేరకు జిల్లాలో అనంతపురం లోక్‌సభతో పాటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం అర్బన, కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 20,18,162 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 9,97,792, మహిళా ఓటర్లు 10,20,124 మంది, థర్డ్‌ జెండర్లు 246 మంది ఉన్నారు. అనంతపురం లోక్‌సభకు 21 మంది, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 113 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సార్వత్రిక పోరుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.


వారికి ప్రత్యేకం

దివ్యాంగులు, మహిళలకు ప్రయోగాత్మకంగా కొన్ని ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో దివ్యాంగ ఓటర్లకు అనంతపురం అర్బన నియోజకవర్గంలో గుత్తిరోడ్డునందుగల మాంటెస్సోరి ప్రైవేటు పాఠశాలలోను, శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం చింతర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. మహిళలకు నార్పల మండలం కేశేపల్లి, రాయదుర్గం పట్టణంలోని పీఎ్‌సనెంబరు 187 ప్రభుత్వ హైస్కూల్‌, ఉరవకొండ పట్టణంలోని కరిబసప్ప స్వామి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గుంతకల్లు పట్టణంలోని రోటరీ ఇంగ్లీ్‌షమీడియం స్కూల్‌, తాడిపత్రి నియోజకవర్గంలో కావేటి సముద్రం మండల పరిషత ప్రైమరీ పాఠశాల, అనంతపురం నగరం తపోవనం జిల్లాపరిషత ఉన్నత పాఠశాల, కళ్యాణదుర్గం పట్టణంలోని నార్త్‌ మండల పరిషతప్రైమరీ పాఠశాల, చెన్నేకొత్తపల్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. యువ ఓటర్ల కోసం ఉరవకొండలోని సెంట్రల్‌ ఉన్నత పాఠశాల, బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మండల పరిషత ప్రైమరీ పాఠశాలలో ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


2,236 కేంద్రాలు..

జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి 2,236 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ రాష్ట్ర కమిషనతో మాట్లాడి ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయించారు. జిల్లాలో తొలుత 1032 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. కలెక్టర్‌ పోలీస్‌ శాఖతో పూర్తీ సమాచారం తీసుకొని ఇందులో 692 మరింత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ కేంద్ర బలగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. పోలింగ్‌ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 22 వేల మంది పోలీసు సిబ్బంది, 12 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు

రెడీ రెడీ..

అభ్యర్థుల భవితవ్యం తేల్పడానికి ఓటింగ్‌ సమయం వచ్చేసింది. పోలింగ్‌ నిర్వహణకు పీఓలు 2,472 మంది, ఏపీఓలు 2,552 మంది, ఓపీఓలు 10,208 మంది చొప్పన15,232 మంది సిబ్బందిని నియమించారు. వారంతా ఆదివారం ఈవీఎంలతో పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అనంతపురం అర్బన, ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్‌ కళాశాలలో శింగనమల, ఎస్‌ఎ్‌సబీఎన కళాశాలలో రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఇతర సామగ్రిని పంపిణీచేసి తరలించారు. రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఆయా నియోజకవర్గ కేంద్రాలలోనే సిబ్బందికి


అందజేసి పటిష్ట పోలీస్‌ బందోబస్తు మధ్య తరలించారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ మొదలై సాయంత్రం 6గంటల వరకు కొనసాగిస్తారు. సాయంత్రం 6గంటలలోపు క్యూలో ఉంటే ఆ ఓటర్లు ఓటు వేసే వరకు పోలింగ్‌ కొనసాగిస్తారు. జిల్లా ఎన్నికల పరిశీలకుడు మనీష్‌ సింగ్‌, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, ఎస్పీ అమిత బర్దర్‌ పర్యవేక్షణలో ఎన్నికల సామగ్రిని కేంద్రాలకు ప్రత్యేక వాహనాలలో తరలింపజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని, ప్రతిఒక్కరు నిర్భయంగా కేంద్రాలకు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో పోలింగ్‌కు ఎవరైనా అవాంతరాలు కలిగించినా, అల్లర్లు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 13 , 2024 | 12:18 AM