Share News

WATER PROBLEM : తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:43 PM

గుత్తిఆర్‌ఎస్‌లో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మూడు నెలలుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో గుత్తి ఆర్‌ఎస్‌లోని ఏడో వార్డు మహిళలు ఖాళీ బిందెలు తీసుకుని పత్తికొండ రోడ్డు సర్కిల్లో ఆందోళన చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ డౌన డౌన అంటూ నినాదాలు చేశారు. మూడు నెలలుగా కొళాయిలకు...

WATER PROBLEM : తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
Women standing on the road with empty bins

ఖాళీ బిందెలతో నిరసన

గుత్తి, ఏప్రిల్‌ 25: గుత్తిఆర్‌ఎస్‌లో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మూడు నెలలుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో గుత్తి ఆర్‌ఎస్‌లోని ఏడో వార్డు మహిళలు ఖాళీ బిందెలు తీసుకుని పత్తికొండ రోడ్డు సర్కిల్లో ఆందోళన చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ డౌన డౌన అంటూ నినాదాలు చేశారు. మూడు నెలలుగా కొళాయిలకు తాగునీరు సరఫరా చేయకపోతే తాము ఎలా జీవించాలం టూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్న నీరు ఏమాత్రం సరిపోవడం లేదని మండిపడ్డారు.


కొళాయిల ద్వారానే నీటిని సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే సందర్భంలో చెట్నెపల్లికి ప్రచారం నిమిత్తం వెళ్తున్న టీడీపీ అభ్యర్థి సోదరుడు గుమ్మనూరు నారాయణ, నాయకులు ఆందోళనకారుల వద్దకు వెళ్లి నచ్చజెప్పారు. తమ సమస్యను మహిళలు వారి దృష్టికి తెచ్చారు. దీంతో వారు మున్సిపల్‌ అధికారులతో ఫోనలో మాట్లాడారు. కొళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తామని అధికారులు చెప్పారని నాయకులు చెప్పడంతో మహిళలతో ఆందోళన విరమించారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 11:43 PM