Share News

Y Juncton : వై జంక్షన కబ్జా

ABN , Publish Date - Oct 04 , 2024 | 11:54 PM

కలెక్టరేట్‌ సమీపంలోని పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయం కబ్జాకు గురవుతోంది. నగరంలోకి ప్రవేశించే కదిరి బైపాస్‌, జేఎనటీయూ రోడ్డు కలిసే వై జంక్షనలో ఉన్న కార్యాలయం కనిపించకుండా కొందరు పాగావేశారు. కార్యాలయం ముందు దుకాణాలను ఏర్పాటు చేసి.. రోడ్డు వరకు విస్తరించారు. దీంతో కార్యాలయ బోర్డు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సైతం కనుమరుగయ్యాయి. వైసీపీ హ యాంలో ఈ కబ్జాల పర్వం

Y Juncton : వై జంక్షన కబ్జా
Shopkeepers occupied the road

వైసీపీ హయాంలో దురాక్రమణ

రోడ్డు వరకూ దుకాణాల ఏర్పాటు

కనిపించని పట్టు పరిశ్రమ కార్యాలయం

నగరపాలిక అధికారులకు నెల మామూళ్లు

కలెక్టరేట్‌ సమీపంలోని పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయం కబ్జాకు గురవుతోంది. నగరంలోకి ప్రవేశించే కదిరి బైపాస్‌, జేఎనటీయూ రోడ్డు కలిసే వై జంక్షనలో ఉన్న కార్యాలయం కనిపించకుండా కొందరు పాగావేశారు. కార్యాలయం ముందు దుకాణాలను ఏర్పాటు చేసి.. రోడ్డు వరకు విస్తరించారు. దీంతో కార్యాలయ బోర్డు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సైతం కనుమరుగయ్యాయి. వైసీపీ హ యాంలో ఈ కబ్జాల పర్వం మొదలైంది. ఖాళీ స్థలాల్లో టీ స్టాళ్లు, మిల్క్‌ డెయిరీలు, చేపల దుకాణాలను ఏర్పాటు చేయించారు. దుకాణదారుల నుంచి రూ.లక్షల్లో ముడుపులు


దండుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు.

-అనంతపురం సెంట్రల్‌

అధికారుల హస్తం..?

పట్టుపరిశ్రమ కార్యాలయం ఖాళీ స్థలాల ఆక్రమణల వెనుక వైసీపీ నాయకులతో పాటు కార్యాలయంలోని కొందరు అధికారుల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయం ముందున్న దుకాణాలను తొలగించాలని అప్పట్లో విన్నవించినా సొంత శాఖ అధికారులే పెడచెవిన పెట్టారని కొందరు అంటున్నారు. కార్యాలయం మనదే అయినా ముందున్న స్థలం నగరపాలిక పరిధిలో ఉందని సాకులు చెప్పారని అంటున్నారు. అప్పటి ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులే దుకాణాలు వేయించారని, తాము ఫిర్యాదు చేసే స్థాయిలో లేమని కొందరు అధికారులు చేతులు ఎత్తేశారని అంటున్నారు.

పొంచివున్న ప్రమాదాలు

ఫోర్‌లేన బైపాస్‌ రోడ్డుకు ఇరువైపులా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్యాసింజర్‌, హెవీ వెహికల్స్‌ రాకపోకల రద్దీ కారణంగా వై జంక్షనలో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయం ముందు ఫుట్‌పాత లేకుండా దుకాణాలను ఏర్పాటు చేశారు. వాహనాలు అదుపుతప్పితే నేరుగా ఈ దుకాణాల్లోకే దూసుకుపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పేరుతో దుకాణాలను ఏర్పాటు చేయించి.. వారిని ప్రమాదపుటంచున ఉంచారని విమర్శిస్తున్నారు.

నెల మామూళ్లు..

దుకాణాలకు వచ్చే వారి టూవీలర్స్‌, కార్లను రోడ్డుపైనే పెడుతున్నారు. ఇదే అదనుగా నగరపాలికలోని కొందరు అధికారులు దుకాణాదారుల నుంచి నెల మామూళ్లు వసూలు చేస్తున్నారు. దుకాణదారులు ప్రశ్నిస్తే.. రోడ్డువరకు దుకాణాలు వేసుకున్నారు కదా..? కూల్చేయమంటారా? అని బెదిరిస్తున్నారని సమాచారం. పట్టుపరిశ్రమ శాఖ అధికారులు మిన్నకుండి పోవడం, నగరపాలిక అధికారులు ముడుపులతో సరిపెట్టుకోవడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆక్రమించుకున్నారు..

కార్యాలయం ముందున్న స్థలాన్ని ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డు వరకు దుకాణాలను విస్తరించి మా ఆఫీసు బోర్డుకూడా కనబడకుండా చేశారు. పనులమీద వచ్చే పట్టు రైతులకు కార్యాలయం కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది లోపలికి రావాలంటే వాహనాలన్నీ అడ్డుగా ఉంటున్నాయి. వారికి ఎవరు అనుమతి ఇచ్చారో, ఎందుకు పట్టించుకోవడంలేదో తెలియడంలేదు. ఆక్రమణల విషయం మాకు సంబంధంలేదు.

- ఆంజనేయులు, జిల్లా పట్టుపరిశ్రమ శాఖ అధికారి


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 04 , 2024 | 11:54 PM