Share News

AP News: ఈ నెల 24వ తేదీన కేబినెట్ భేటీ..

ABN , Publish Date - Jun 22 , 2024 | 06:29 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన ఎన్డీయే కూటమి ప్రభుత్వం పాలనలో దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిని సందర్శించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కేబినెట్ భేటీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

AP News: ఈ నెల 24వ తేదీన కేబినెట్ భేటీ..
Andhra Pradesh Cabinet Meeting

అమరావతి, జూన్ 22: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన ఎన్డీయే కూటమి ప్రభుత్వం పాలనలో దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిని సందర్శించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కేబినెట్ భేటీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జూన్ 24వ తేదీన అంటే సోమవారం నాడు కేబినెట్ తొలి సమావేశం జరుగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరుగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు.


ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కెబినెట్లో కీలక చర్చ జరపనున్నారు. మొత్తం ఎనిమిది శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసే అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్‌లో ప్రత్యేక ప్రస్తావన ఉండనుందని సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది కొత్త ప్రభుత్వం. రూ. 14 లక్షల కోట్లకు పైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇదిలాఉంటే.. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపైనా కేబినెట్‌లో కీలక చర్చ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 22 , 2024 | 06:30 PM