Andhra Pradesh: జగన్ భజన బ్యాచ్‌కు షాక్.. కీలక ఉత్తర్వులు జారీ..
ABN , Publish Date - Jun 20 , 2024 | 04:04 PM
రాష్ట్రంలో ప్రభుత్వం మారడమే కాదు.. పరిపాలన విభాగంలోనూ సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న జగన్ భజన బ్యాచ్.. బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్ పాలనా సమయంలో అనేక శాఖల్లో తిష్ట వేసిన రిటైర్డ్ ఉద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. ఈ బ్యాచ్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని విషయాలను జగన్‌కు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.
అమరావతి, జూన్ 20: రాష్ట్రంలో ప్రభుత్వం మారడమే కాదు.. పరిపాలన విభాగంలోనూ సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న జగన్(YS Jagan) భజన బ్యాచ్‌కి.. బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్ పాలనా సమయంలో అనేక శాఖల్లో తిష్ట వేసిన రిటైర్డ్ ఉద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది చంద్రబాబు(CM Chandrababu) సర్కార్. ఈ బ్యాచ్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని విషయాలను జగన్‌కు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సీఎం చంద్రబాబుకు తెలియడంతో.. అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు.. ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్ అయి ఆయా శాఖల్లో ఇప్పటికీ పని చేస్తున్న వారందరితో రాజీనామా చేయించాలని ఆదేశించారు.
ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అందరితో రాజీనామా చేయించి.. వారిని సాగనంపాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేది లోగా అందరితో రాజీనామా చేయించి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వం మారినా.. పోలీస్, రెవిన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ సహా పలు శాఖల్లో రిటైర్ ఉద్యోగులు కొనసాగుతున్నారు. ఆయా శాఖల్లో వారి సేవలు అవసరమైతే మళ్ళీ తాజా అపాయింట్‌మెంట్ ఆర్డర్ ప్రభుత్వం అనుమతితోనే ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వం తమ హయాంలో కొందరు అధికారులు రిటైర్ అయినప్పటికీ కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పటికీ వారు ఆయా డిపార్ట్‌మెంట్లలో కొనసాగుతూ వస్తున్నారు. వీరంతా జగన్‌కు ఫేవర్‌గా పని చేస్తూ వచ్చారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా వారు ఆయా శాఖల్లో ఉంటూ.. ప్రభుత్వంలో జరిగే విషయాలను జగన్‌కు చేరవేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన సీఎం చంద్రబాబు.. భజన బ్యాచ్‌కు షాక్ ఇచ్చారు. వారందరినీ ఇంటికి పంపించేస్తున్నారు.