CM ChandraBabu: వారికి రూ.3 వేలు ఆర్థిక సాయం..
ABN , Publish Date - Jul 26 , 2024 | 08:23 PM
గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా 4,317 ఎకరాల వరి పంట దెబ్బతిందన్నారు.
అమరావతి, జులై 26: గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా 4,317 ఎకరాల వరి పంట దెబ్బతిందన్నారు.
Also Read: Maharashtra: ‘గ్యాంగ్‌స్టర్’ కొంప ముంచిన ఫ్యాన్స్ అత్యుత్సాహం
అయితే 1.06 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిన పంట నీటి ముంపునకు గురైందని సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే మొక్కజొన్న, పత్తి తదితర పంటలు సైతం దెబ్బతిన్నాయని చెప్పారు. అల్లూరి జిల్లాలోనూ కొన్ని చోట్ల వరద ప్రభావం ఉందన్నారు. ఇప్పటికీ తూర్పు గోదావరి జిల్లాలో 273 ఎకరాల పంట నీట మునిగిందని ఆయన వివరించారు.
Also Read:AP Minister: మరోసారి ఉదారత చాటుకున్న మంత్రి నారా లోకేశ్
వారికి రూ. 3 వేలు ఆర్థిక సాయం..
ఇళ్ల నీట మునిగిన వారికి, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకున్న కుటుంబాలకు రూ. 3 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అదే విధంగా 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, బంగాళదుంపలతోపాటు కేజీ ఉల్లిపాయలు సాయం కింద అందజేయాలని అధికారుకు సూచించామన్నారు.
Also Read: Mizoram: రూ.42.38 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
వ్యవసాయ, హోం శాఖ మంత్రులకు ఆదేశాలు
క్షేత్ర స్థాయికి వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని వ్యవసాయ, హోంశాఖ మంత్రులను ఆదేశించానని చెప్పారు. న్యూఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశం కారణంగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్ల లేక పోతున్నానని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. అయితే పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని మంత్రులకు, ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు.
Also Read: CM Pushkar Singh Dhami: కార్గిల్ విజయ్ దివస్ వేళ ఉత్తరాఖండ్ ‘అగ్నివీరులకు’ గిఫ్ట్
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు..
ఇటీవల ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలోని నదులు వాగులు సైతం పొంగి ప్రవహించాయి. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ క్రమంలో వారి కోసం ప్రత్యేక శిబిరాలు సైతం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాలో భారీగా పంటలు సైతం నీట మునిగాయి. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేయాలని కేబినెట్‌లోని పలువురు కీలక శాఖలకు చెందిన మంత్రులతోపాటు ఉన్నతాధికారులను సైతం సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Also Read: Delhi excise case: మనీష్‌తోపాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
రేపు నీతి ఆయోగ్ సమావేశం.. ఢిల్లీకి సీఎం చంద్రబాబు..
జులై 27న అంటే శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సిఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తిరింది. అనంతరం తొలిసారిగా ఆయన ఈ సమావేశంలో పాల్గొనున్నారు. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Also Read: High alert in Jammu: ఆర్మీ స్కూల్స్ మూసివేత.. ఎందుకంటే..?
అందులో ఏపీకి వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను సైతం చంద్రబాబు కలుస్తారని సమాచారం. ఈ సందర్భంగా వారికి కృతజ్జతలు చెప్పే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
For Latest News and National News click here