AP Politics: బస్సు ఎక్కితే రూ.500, మందు, మాంసం.. రాప్తాడు జగన్ సిద్ధం సభకు జనం తరలింపు
ABN , Publish Date - Feb 18 , 2024 | 08:58 AM
సిద్ధం బహిరంగ సభలతో జనం వద్దకు వెళుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆదివారం (ఈ రోజు) అనంతపురం జిల్లా రాప్తాడు ఆటో నగర్ వద్ద జగన్ సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అనంతపురం: సిద్ధం బహిరంగ సభలతో జనం వద్దకు వెళుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆదివారం (ఈ రోజు) అనంతపురం జిల్లా రాప్తాడు ఆటో నగర్ వద్ద జగన్ (Jagan) సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు వచ్చేందుకు జనం ఆసక్తి చూపించడం లేదు. దీంతో వారికి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సభ కోసం వచ్చే వారికి రూ.500, మందు, మాంసాహారం ఇస్తున్నారు. సభకు వచ్చేప్పుడు ఇస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దాంతో బస్సులను కదలనీవ్వడం లేదు. అధికారంతో రాయలసీమలో ఉన్న ఆర్టీసీ బస్సులు (RTC BUS), ప్రైవేట్ బస్సులను ఎక్కడిక్కడ నిలిపివేశారు. దీంతో గ్రామాలకు వెళ్లే వారు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జనం సీఎం జగన్‌ను నిలదీసే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాకు ఏం చేశారో చెప్పాలని కోరుతున్నారు. ఒక పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని అడిగారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. మద్యపాన నిషేధంపై మాట తప్పారని జనం ఆగ్రహాంతో ఉన్నారు. సిద్ధం సభలో ఈ అంశాలపై సీఎం జగన్‌ను నిలదీస్తామని జనం అంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.