AP Congress: మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై ఎక్స్ వేదికగా ఏపీ కాంగ్రెస్ ఫైర్..
ABN , Publish Date - Jul 27 , 2024 | 08:35 PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తీరుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ(AP Congress Party) ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను జగన్ గాలికి వదిలేశారంటూ మండిపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను ఆయన కనీసం పట్టించుకోలేదని ధ్వజమెత్తింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తీరుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ(AP Congress Party) ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను జగన్ గాలికి వదిలేశారంటూ మండిపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను ఆయన కనీసం పట్టించుకోలేదని ధ్వజమెత్తింది. మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్లో బండిని తీసుకెళ్లి పట్టాలు తప్పించుకునేలా వైసీపీ వాళ్ల ప్రవర్తన ఉందని ఏపీ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.
అసెంబ్లీకి రాకుండా ఎందుకు పారిపోతున్నారు?
వైసీపీ చేపట్టిన ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని ఓ వైపు కోరుతూనే, మళ్లీ మా పార్టీ మీదే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెదడులో పస ఉన్నవాళ్లు ఎవరైనా ఈ వాదన వింటే పగలపడి నవ్వుకుంటారని ఎక్స్‌లో రాసుకొచ్చారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత హత్యను సాకుగా చూపి ఢిల్లీలో అర్ధరహితమైన, ఎవ్వరూ పట్టించుకోని ధర్నా చేస్తే మీ వ్యక్తిగత ఎజెండాకు కాంగ్రెస్ మద్దతు పలకాలా? అంటూ ప్రశ్నించారు. ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బురద, వరదనీటిలో దిగి రైతు కన్నీటి కథల్ని దేశం మెుత్తం కాంగ్రెస్ నేతలు చూపెట్టారు. మరి మీరేమో రాష్ట్రంలో ఉండి పోరాటం చెయ్యకుండా పిరికివాళ్లలా అసెంబ్లీ నుంచి పారిపోయారు.
Kollu Ravindra: వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు..
ఏపీ కోసం ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు?
"ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న స్పందన చూసి వణుకు పుట్టిందా?. మేము మీలాగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఉండే వాళ్లం కాదు. మాకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకపోయినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం. అసెంబ్లీలో కూర్చుని పోరాడే అవకాశం ఉన్నా, ప్రజలు ఊడపీకిన ప్రతిపక్ష హోదా కోసం తహతహలాడుతున్నారు. దాని కోసం కోర్టు గుమ్మాలు తడుతున్నారు. వైసీపీ లాగా వెన్నుపోటు పొడిచి ఆ తర్వాత వెన్ను చూపి పారిపోము. దమ్ముంటే మణిపూర్లో జరిగిన మారణకాండను ఎందుకు ఖండించలేదో రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీతో సంబంధం ఎందుకు కొనసాగించారో వెల్లడించండి. ప్రత్యేక హోదా, పోలవరం కోసం ధర్నాలు ఎందుకు చెయ్యలేదో తెలపండి. పూర్తి మద్యపాన నిషేధం, వైఎస్ఆర్ జలయజ్ఞం ఎందుకు చేయలేదో చెప్పండి. లేకపోతే ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ" ఏపీ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Devineni Uma: జగన్‌కు మీడియా ముందు మాట్లాడే ధైర్యం లేదా?: దేవినేని ఉమా..
AP News: వైసీపీ హయాంలో సర్పంచ్‌లను వేధించారు: వైవీబీ రాజేంద్రప్రసాద్
AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చీలిక.. కొత్త అధ్యక్షుడు ఎవరంటే?