Share News

CM Chandrababu: కాకినాడ పోర్ట్‌కు ఐపీఎస్‌ అధికారి.. సీఎం కీలక నిర్ణయం

ABN , Publish Date - Dec 02 , 2024 | 08:23 PM

కాకినాడ పోర్ట్ ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ వార్త ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అలాగే మంత్రి వర్గ ఉప సంఘం సైతం ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

CM Chandrababu: కాకినాడ పోర్ట్‌కు ఐపీఎస్‌ అధికారి.. సీఎం కీలక నిర్ణయం

అమరావతి,డిసెంబర్ 02: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరాబ్ కుమార్ ప్రసాద్ సోమవారం అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశంలో చర్చించిన కీలక అంశాలను సీఎంకు సీఎస్ వివరించారు. అలాగే డీజీపీ ద్వారక తిరమలరావుతోపాటు ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్ చంద్ర లడ్డా భేటీ అయ్యారు.

Also Read: కొత్త ఇంటికి శ్రద్ధా.. ఎక్కడంటే..

Also Read: ఇన్ఫోసిస్‌కు పెద్ద ఎదురుదెబ్బ..రూ.238 కోట్ల భారీ జరిమానా


రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన కీలక కేసుల్లో పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలను తీసుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు. కాకినాడ పోర్ట్‌కు ప్రత్యేకంగా ఓ ఐపీఎస్ అధికారిని నియమించే అంశంపై ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు.

Also Read: వరద నీటిలో కొట్టుకు పోయిన బస్సులు, కార్లు.. ఎక్కడంటే..

Also Read: ఈ ఐపీఎస్‌ను కాలం ఎంతలా పగబట్టిందంటే..


మరోవైపు కాకినాడ పోర్ట్ ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ వార్త ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అలాగే మంత్రి వర్గ ఉప సంఘం సైతం ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యహారంపై వీరిద్దరు కీలకంగా చర్చించారు.

Also Read: పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది

Also Read: నామినేటేడ్ పోస్టులపై కసరత్తు.. మరో 15 రోజుల్లో ప్రకటన

Also Read: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో యువకుల హల్‌చల్


మంగళవారం అమరావతిలో మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలతోపాటు ఇకపై కాకినాడ పోర్ట్‌ నుంచి విదేశాలకు తరలించే సరుకుపై నిఘా పెట్టేందుకు కఠిన చర్యలు తీసుకోనే అవకాశముంది. అందులోభాగంగా ఐపీఎస్ అధికారిని నియమించే అంశంపై ఓ కీలక నిర్ణయం తీసుకో వచ్చని తెలుస్తుంది.

For AndhraPradesh News And Telugu news

Updated Date - Dec 02 , 2024 | 08:23 PM