Share News

AP High Court : గంజాయి కేసుల్లో ఇదేం తీరు?

ABN , Publish Date - Dec 07 , 2024 | 05:10 AM

ఎన్‌డీపీఎస్‌ (గంజాయి) కేసుల్లో రాష్ట్రంలోని పోలీసుల పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వ్యక్తులను అరెస్ట్‌ చేస్తున్నారని..

AP High Court : గంజాయి కేసుల్లో ఇదేం తీరు?

  • సహనిందితుల వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు...దర్యాప్తులో పురోగతి ఉండదు

  • బెయిల్‌ నిరాకరించాలని ఎలా కోరతారు?

  • పోలీసుల పనితీరుపై హైకోర్టు అసంతృప్తి

  • పిటిషనర్‌కు బెయిల్‌ మంజూరు

అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎన్‌డీపీఎస్‌ (గంజాయి) కేసుల్లో రాష్ట్రంలోని పోలీసుల పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వ్యక్తులను అరెస్ట్‌ చేస్తున్నారని, నెలలు గడుస్తున్నా ఎలాంటి ఆధారాలు సేకరించకుండా బెయిల్‌ నిరాకరించాలని కోరడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. శుక్రవారం ఓ ఎన్‌డీపీఎస్‌ కేసులో నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.విశాఖపట్నం, నక్కపల్లి మండలం, ఒడ్డిమిట్ట వద్ద లారీలో తరలిస్తున్న 530 కేజీల గంజాయిని 2022 జూన్‌ 11న పోలీసులు పట్టుకున్నారు.

లారీ డ్రైవర్‌ సందీ్‌పసింగ్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరికొందరిని సహనిందితులుగా చేర్చారు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న నడిగట్ల హనుమంతురావును ఈ ఏడాది ఆగస్టులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో బెయిల్‌ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌....ప్రస్తుత కేసులో గంజాయి రవాణా చేస్తుండగా అరెస్ట్‌ అయిన లారీ డ్రైవర్‌ వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్‌ను అరస్ట్‌ చేశారని, నాలుగు నెలలు గడుస్తున్నా అతనికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం సేకరించలేదన్నారు. ఈ నేపఽథ్యంలో పిటిషనర్‌కు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - Dec 07 , 2024 | 05:10 AM