Atchannaidu: ఆ ఎమ్మెల్యే దందాను బయటపెట్టినందుకే కంచేటి సాయిపై కక్ష్య సాధింపులు
ABN , Publish Date - Jan 31 , 2024 | 12:42 PM
Andhrapradesh: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పీపసాడుకు చెందిన టీడీపీ నేత కంచేటి సాయిపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేయడంపై తెలుగు దేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అచ్చెన్న పలు ప్రశ్నలు సంధించారు.
అమరావతి, జనవరి 31: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన టీడీపీ నేత కంచేటి సాయిపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేయడంపై తెలుగు దేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అచ్చెన్న పలు ప్రశ్నలు సంధించారు. ‘‘మీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా జగన్ రెడ్డి?’’ అంటూ మండిపడ్డారు. పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు ఇసుక దందాను బయపెట్టినందుకే టీడీపీ నేత కంచేటి సాయిపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజా సంపదను దోచుకోవటం ఏంటని ఎమ్మెల్యేని ప్రశ్నించటం తప్పా అని నిలదీశారు. ప్రకృతి వనరులు పట్టపగలే దోపిడి చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా అంటూ మండిపడ్డారు. సాయిపై దాడి చేస్తామంటూ వైసీపీ నేతలు బహిరంగంగా కర్రలు పట్టుకుని తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహించారు. ఎమ్మెల్యే శంకర్రావు కుమారుడు కళ్యాణ్ నియోజకవర్గంలో రౌడీ గ్యాంగ్‌ను పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. ఆ గ్యాంగ్‌తో సినీ పక్కీలో ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేయిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కుమారుడి ఆగడాలు సీఎంకి, డీజీపీకి కనిపించటం లేదా అని అడిగారు. కంచేటి సాయికి భద్రత కల్పించాలని, సాయికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...