AP Fiber Net: ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు ఇంకా జగన్ మత్తు వీడలేదా?
ABN , Publish Date - Jun 22 , 2024 | 08:26 PM
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 20రోజులు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(APSFL) సంస్థకు మాత్రం ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్ మత్తు వదిలినట్లు లేదు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినా టీవీ ఆన్ చెయ్యగానే నేటికీ ముఖ్యమంత్రిగా జగన్, మంత్రిగా అమర్నాథ్, APSFL ఛైర్మన్‌గా గౌతం రెడ్డి ఫొటోలు ప్రత్యక్షం అవుతున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 20రోజులు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(APSFL) సంస్థకు మాత్రం ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్ మత్తు వదిలినట్లు లేదు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినా టీవీ ఆన్ చెయ్యగానే నేటికీ ముఖ్యమంత్రిగా జగన్, మంత్రిగా అమర్నాథ్, APSFL ఛైర్మన్‌గా గౌతం రెడ్డి ఫొటోలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఇప్పటివరకూ ట్రిపుల్ ప్లే బాక్సులను అప్డేట్ చేయకపోవడంతోనే వారి ఫొటోలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మారినా ఫైబర్ నెట్ అధికారుల తీరు మారదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నా.. ఫైబర్ నెట్ అధికారులకు వైసీపీ మత్తు వీడినట్లు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
రెచ్చిపోయిన మాజీ ఎంపీ ఆదాల అనుచరులు..
Pawan Kalyan: జనసేన కేంద్ర కార్యాలయం వద్ద రోడ్డుపైనే ప్రజాదర్బార్ నిర్వహించిన పవన్..