Share News

AP News: ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీని వదలని సైబర్ నేరగాళ్లు

ABN , Publish Date - Mar 13 , 2024 | 04:24 PM

Andhrapradesh: సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్‌లతో సెలబ్రెటీస్‌ను, ప్రముఖులను కూడా సైబర్ నేరగాళ్లు ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చేరారు. యూనిఫాంలో ఉన్న ఆయన ఫోటోతో, పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌ను కేటుగాళ్లు రూపొందించారు.

AP News: ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీని వదలని సైబర్ నేరగాళ్లు

విజయవాడ, మార్చి 13: సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్‌లతో సెలబ్రెటీస్‌ను, ప్రముఖులను కూడా సైబర్ నేరగాళ్లు ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు (APSRTC MD Dwaraka Tirumala rao) చేరారు. యూనిఫాంలో ఉన్న ఆయన ఫోటోతో, పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌ను (Face Book Account) కేటుగాళ్లు రూపొందించారు. అయితే విషయం తెలిసిన ఆర్టీసీ ఎండీ వెంటనే అప్రమత్తమయ్యారు. తనకు ఫేస్‌బుక్ అకౌంట్ లేదని.. ఎవరూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ విషయంపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆర్టీసీ ఎండీ ఫిర్యాదు చేశారు. అసలు సోషల్ మీడియాలో తనకు ఏ ఖాతా లేదని ద్వారకా తిరుమల రావు స్పస్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

Big Breaking: మరో వైసీపీ ఎంపీ ఔట్.. త్వరలోనే ఆ పార్టీలో చేరిక..

TS News: నేను అమిత్ షాను కలవలేదు.. ఆరూరి రమేష్ కీలక ప్రకటన


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 13 , 2024 | 04:28 PM