Grandhi Srinivas: చిరంజీవికి పవన్‌కు పోలికేంటి?.. గ్రంధి ఫైర్
ABN , Publish Date - Mar 13 , 2024 | 12:00 PM
Andhrapradesh: జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా రాజ్యం పార్టీ నాటి నుంచి పవన్ భాష ఏ రకంగా ఉందో అందరికీ తెలుసన్నారు.
పశ్చిమగోదావరి, మార్చి 13: జనసేన అధినేత పవన్ (Janasena Chief Pawan Kalyan) వ్యాఖ్యలు చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ (Bhimavaram MLA Grandhi Srinivas) ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా రాజ్యం పార్టీ నాటి నుంచి పవన్ భాష ఏ రకంగా ఉందో అందరికీ తెలుసన్నారు. ‘‘ఇల్లు కొనడానికి వస్తే నేను అడ్డుకున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ వస్తే నాకు ఉన్న 9 ఏకరాల్లో ఎంత కావాలంటే అంత ఇస్తా. భీమవరం వచ్చి ప్రజలు నీ గురించి ఏమి అనుకుంటున్నారో ఒక్కసారి పవన్ తెలుసుకోవాలి. నీ అభిమానులకు సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు.. అందుకే నీ నిజ స్వరూపం ఎవ్వరికీ తెలియడం లేదు. 24 సీట్లకు పరిమితం అయ్యి చంద్రబాబు మోచేతి నీళ్ళు పవన్ కళ్యాణ్ తాగేందుకు సిద్ధం అయ్యారు. 24 సీట్లకు ఒప్పుకుని ఇప్పుడు 21సీట్లు అంటున్నారు. సొంత అన్నయ్యతో విభేదించా అంటున్నారు.. చిరంజీవికి (Megastar Chiranjeevi) పవన్‌కు పోలిక ఏంటి?. 18 సీట్లు, 80 లక్షల ఓట్లు వచ్చాయి.. చిరంజీవి చాలా సౌమ్యుడు. మరో అన్న నాగబాబుకి (Nagababu) పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారు. పవన్ కల్యాణ్‌ను మంచి మానసిక వైద్యుడికి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలని అనే అనుమానం వస్తుంది. వ్యాధి ముదిరితే ప్రాణాంతకం అవుతుంది’’ అంటూ కామెంట్స్ చేశారు. ఉసరవెల్లి లాంటి వ్యక్తి పులపర్తి రామాంజనేయులు అని విమర్శించారు. ప్రజల తాగునీటి పేరుతో 50 ఎకరాల భూములు దోచేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పులపర్తి అని మండిపడ్డారు. రౌడీయిజం చేస్తున్నా అంటున్నారని.. తనపై ఒక్క క్రిమినల్ కేసు ఎక్కడైనా ఉందా అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
AI Scam: వామ్మో పేరెంట్స్ లక్ష్యంగా కొత్త ఏఐ స్కామ్.. ఇది మీకు తెలుసా?
Union Minister: కేంద్రమంత్రి సంచలన కామెంట్స్.. ఓటమి భయంతోనే డీఎంకే కూటమిలోకి కమలహాసన్..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...