Bhuvaneshwari: గుంటూరులో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర
ABN , Publish Date - Feb 07 , 2024 | 11:01 AM
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర జిల్లాలో కొనసాగుతోంది. రెండో రోజు యాత్రలో భాగంగా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన భువనమ్మ ప్రత్తిపాడు నియోజకవర్గంలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు.
గుంటూరు, ఫిబ్రవరి 7: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ‘‘నిజం గెలవాలి’’ యాత్ర జిల్లాలో కొనసాగుతోంది. రెండో రోజు యాత్రలో భాగంగా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన భువనమ్మ ప్రత్తిపాడు నియోజకవర్గంలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా బుడంపాడులో భువనేశ్వరికి ప్రత్తిపాడు టీడీపీ ఇంచార్జ్ రామాంజనేయులు స్వాగతం పలికారు. బుడుంపాడులో మైలా శివయ్య యాదవ్ , అనంతరవరప్పాడులో కోటేశ్వరరావు, వింజనంపాడులో నార్నె విజయలక్ష్మీ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. టీడీపీ ఇంచార్జ్ రామాంజనేయలుతో కలసి మృతుల కుటుంబాలకు భువనేశ్వరి ఆర్థిక సాయం అందజేయనున్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెంది మృతిచెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలావాలి’’ పేరుతో భువనేశ్వరి మృతుల కుటుంబాలను కలిసి ఓదారుస్తున్నారు. ఈరోజు ప్రత్తిపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల్లో భువనమ్మ పర్యటించనున్నారు. మొత్తం 8 మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కును భువనేశ్వరి అందించనున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...