చంద్రబాబు లక్ష్య సాధన కోసమే పురాణపండతో ‘నారసింహో ... ఉగ్రసింహో’: బొల్లినేని కృష్ణయ్య
ABN , Publish Date - Jun 05 , 2024 | 12:14 AM
జాతీయ స్థాయిలో పేరు పొందిన బొల్లినేని కృష్ణయ్య ఒక చారిత్రాత్మకమైన పవిత్ర కార్యం చేపట్టడం ఇటు రాజకీయ వర్గాల్ని, అటు విజ్ఞుల్ని ఆకర్షించింది. ఈ నెల తొమ్మిదవ తేదీన మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలకు ‘జయ జయోస్తు’ పలుకుతూ రెండు అపురూప మంగళ గ్రంధాలను శరవేగంగా రూపొందింపజేస్తున్నారు. అవే ‘జయ జయోస్తు’, ‘నారసింహో ... ఉగ్రసింహో’.
విజయవాడ, జూన్ 4: ఈ దేశంలో ఉన్న మహోన్నత వైద్యశాలల్లో ఒకటిగా... జంట నగరాలు కేంద్రంగా వేలకొలది రోగులకు ఆరోగ్య సేవలు అందిస్తున్న కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యను ఒక సందర్భంలో మెగాస్టార్, పద్మ విభూషణ్ చిరంజీవి ఘనంగా సన్మానిస్తూ... ‘బొల్లినేని కృష్ణయ్యగారు నిర్మాణాత్మక సామర్ధ్యం ఉన్న సహృదయశీలి మాత్రమే కాదు, ఆయన మాటల్లో శుభ్రత, స్వచ్ఛతలతో పాటు, ఒక సౌందర్యపు ఆకర్షణల మిలమిల కూడా ఉంది. మానవీయ విలువలతో ప్రేమించి సహకరించే గొప్ప సంస్కారి కళాపిపాసి కృష్ణయ్యగారు. వేలల్లో ఇలాంటి వ్యక్తుల్ని వొకరినో, ఇద్దరినో ... చూస్తాం’ అనడం మామూలు విషయం కాదు కాబట్టే ఎన్నికల ఫలితాల సందర్భంలో బొల్లినేని కృష్ణయ్య పవిత్ర సేవ ఈ వారంలో రెండు ప్రధాన ఆలయాల్లో దర్శనమివ్వబోతోంది.
బొల్లినేని కృష్ణయ్య ఈ దేశంలో ఒక అసాధారణ పారిశ్రామికవేత్త. వేలకొలది ఉద్యోగులకు అన్నంపెట్టి కొలువులిచ్చి, రాజకీయాల్లో సైతం గతంలో శాసన సభ్యుడిగా సమర్ధవంతమైన సేవలు అందించి... నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల దళితవాడల్లో కూడా దేవాలయాల్ని నిర్మించి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన యోధుడు.
జాతీయ స్థాయిలో పేరు పొందిన బొల్లినేని కృష్ణయ్య ఒక చారిత్రాత్మకమైన పవిత్ర కార్యం చేపట్టడం ఇటు రాజకీయ వర్గాల్ని, అటు విజ్ఞుల్ని ఆకర్షించింది. ఈ నెల తొమ్మిదవ తేదీన మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నారా చంద్రబాబునాయుడు, ఆయన శ్రీమతి నారా భువనేశ్వరి దంపతులకు ‘జయ జయోస్తు’ పలుకుతూ రెండు అపురూప మంగళ గ్రంధాలను శరవేగంగా రూపొందింపజేస్తున్నారు.
పవిత్ర గ్రంధాల రచనలో, దైవబలాల గ్రంథ రచనా ప్రచురణలో ఆరితేరిన, వేలాది మంది ఫాలోయర్స్ కలిగిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కి ఈ అపురూపమైన మంగళఅంశాన్ని అప్పగించారు. ఘన విజయం సాధించి , ఆంధ్ర ప్రదేశ్‌కి అద్భుతాల్ని ఇవ్వనున్న చంద్రబాబు దంపతుల ఫోటోలు ఒక వైపు ప్రచురించి... మిగిలిన పూర్తిభాగం దైవీయ స్పృహతో నిండిపోవాలని... త్వరిత గతిన పూర్తి చేయాలని పురాణపండ శ్రీనివాస్‌కి బొల్లినేని చెప్పారు.
వెంటనే పురాణపండ శ్రీనివాస్ మంగళగిరి నారసింహుని స్మరించుకుని క్రొత్త క్రొత్తగా... పరమ పవిత్రంగా బుక్‌ని వేగంగా... సంప్రదాయ ప్రామాణికతలు చెక్కుచెదరకుండా.. తయారు చేస్తున్నట్లు బొల్లినేని అనుచరులు నొక్కి మరీ చెబుతున్నారు. సత్య శోధనల ఈ మంత్ర ముగ్ధ గ్రంధం పేరు.. ‘నారసింహో... ఉగ్రసింహో’. నృసింహ భగవానుని కటాక్షం నారా చంద్రబాబు దంపతులకు పుష్కలంగా ఉండాలని బొల్లినేని ఈ మహోత్తమ కార్యానికి శ్రీనివాస్ చేత శ్రీకారం చుట్టించారు.
అంతే కాకుండా... గతంలో బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన ఒక పుణ్య గ్రంధంలో మరికొన్ని వేదాది విద్యల బలాల అంశాల్ని జోడించి ‘జయ జయోస్తు’ గా సుమారు మూడు వందల పేజీలతో అమరావతి చేరబోతోంది రెండవ గ్రంధం. పురాణపండ శ్రీనివాస్ గ్రంథ వైభవం ఒక రేంజిలో ఉంటుందని, అన్నీ శుభాలతోనే నిండి ఉంటుందని తెలుగుదేశం వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
శుక్రవారం నాటికి ‘నారసింహో ... ఉగ్రసింహో’, ‘జయ జయోస్తు’... ఈ రెండు అపురూప గ్రంధాలు అమరావతికి చేరి చంద్రబాబు దంపతులపై మంగళగిరి లక్ష్మీ నారసింహుని కటాక్షం వర్షింప చేయాలని బొల్లినేని కృష్ణయ్య బలమైన కోరిక. బొల్లినేని సంకల్పానికి దైవబలంగా తేనెలే తేటల మాటల అద్భుతాల పురాణపండ శ్రీనివాస్ దొరకడంతో ఈ బుక్స్ మార్వెలస్‌గా వస్తున్నట్లు అమరావతి తెలుగుదేశం శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
వేదాలు, వేదాంతం, దర్శనాలు, పురాణాలు, వ్యాఖ్యానాలు, ఉపనిషత్తులు, మహాభక్త కవిపరంపరలు... వంటి పరమాద్భుతాల్ని అలవోకగా విస్పష్టంగా చెబుతూ..., వేలకొలది భక్త పాఠకుల్ని ప్రభావితం చేస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ సృజన శక్తులతో ఈ లక్ష్మీ నృసింహుణ్ణి ఆశ్చర్యకర సౌందర్యంతో అందించనున్నారని బెజవాడ దుర్గమ్మ ఆలయ అర్చక పండితులు సైతం ముక్తకంఠంతో ప్రశంసలు వర్షిస్తున్నారు.
పరమ సంస్కారసంపన్నులైన పవిత్ర మూర్తులు కె. ఎస్. రామారావు వంటి తపోనిష్ఠ, కర్తవ్యదీక్ష, అంకితభావం ఉన్న నిస్వార్ధ అధికారిని దుర్గమ్మ తల్లి ఈ దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా నియమించుకుందని, ఈయన సేవలు సుదీర్ఘకాలం భక్తులు అందుకుంటే అంతకంటే ధన్యత ఉండదని మహా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుచే అభినందనలు, ఆశీస్సులందుకున్న శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం జాయింట్ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావుకి మున్ముందుగానే ఈ రెండు దివ్యమంగళ గ్రంధాలను బొల్లినేని కృష్ణయ్య అందించనున్నట్లు ఆలయ వర్గాల సమాచారం.
ఆపత్కాలవేళలో బెజవాడ కనకదుర్గమ్మనే నారా భువనేశ్వరి ముందుగా దర్శించుకున్నారని.. ఆ తరువాత చారిత్రాత్మక ఘన విజయాల్ని చంద్రబాబుకి అమ్మవారి అనుగ్రహం ద్వారా రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారని తెలుగుదేశం సీనియర్ నాయకులు సైతం ఉత్సాహంతో చెప్పుకోవడం బాహాటంగానే కనిపిస్తున్న సత్యం. ఆంధ్రప్రదేశ్‌లో ఎవ్వరికీ రాని మహత్తరమైన ఆలోచనతో బొల్లినేని కృష్ణయ్య ఇంతటి మహోత్తమ కార్యాన్ని పురాణపండ శ్రీనివాస్ ద్వారా రచింపచేసి ప్రధానమైన మంగళగిరి నర్సింహా స్వామికి, బెజవాడ దుర్గమ్మకు అందించి... ఆ దైవబలంతో పార్టీశ్రేణులకు ఈ చక్కని మనోహర గ్రంథాల్ని అందించాలనుకోవడం కేవలం పూర్వజన్మ సుకృతమనే అంటున్నారు.
నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చెయ్యడానికి ముందే ఇలా అక్షరాలతో మంగళస్వరాలు శ్రీమయంగా అందిస్తున్న బొల్లినేని కృష్ణయ్యకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల అభినందనలు వెల్లువెత్తడం తథ్యం. అందులోనూ... పురాణపండ శ్రీనివాస్ పుస్తకం అనగానే ఆ మనోహరత్వపు ఆకర్షణే ఒక అద్భుతమని ఇంద్రకీలాద్రి ఉన్నతోద్యోగులు కూడా ఆకర్షణీయపు పలుకులు పలకడం చంద్రబాబు అనేక విజయాలకు సంకేతంగా చెప్పక తప్పదు.
లౌకిక ప్రయోజనాలకు దూరంగా... దైవీయ చైతన్యపు అంశాలకు దగ్గరగా ప్రాక్టికల్‌గా కనిపించే రచయిత పురాణపండ శ్రీనివాస్ ‘మహా మంత్రస్య’ అనే అపురూపపు మహా గ్రంధంను ఐదేళ్లనాడు అమరావతిలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించి ప్రేమపూర్వకంగా అభినందించడం ఈ సందర్భంలో గుర్తుచేసుకోవాల్సిందే!
అత్యంత ప్రధానాంశం ఏమంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలామంది ప్రముఖులతో విడదీయరాని, విడదీయ లేని స్నేహపూర్వక సంబంధాలున్న బొల్లినేని క్రిష్ణయ్య ఈ రెండు అపురూప గ్రంధాలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ద్వారా గానీ, చలన చిత్ర నిర్మాతల మండలి ద్వారాగాని తెలుగు సినీ పరిశ్రమలో దాదాపుగా అందరికీ యిచ్చే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితుల సమాచారం.