Home » Bollineni Krishnayya
శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం సాయంకాలం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామస్తోత్రమ్’ మంగళగ్రంధాన్ని ఆవిష్కరించి.. స్వయంభూ క్షేత్రాలలో వేలకొలది అద్భుత గ్రంధాలను భక్తకోటికి ఒక యజ్ఞంలా వితరణ చేస్తున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్యను అభినందించారు. అలాగే వివిధ శాస్త్రాల ప్రమాణంతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న ధార్మిక చైతన్య కృషి వెనుక దైవబలం ఉందని, దైవబలం లేకుంటే ఇన్ని అపూర్వాలు సమాజానికి అందవని, పురాణపండ యజ్ఞకార్యాన్ని ఆయన ప్రశంసించారు.
అమోఘమైన తపశ్శక్తితో మన ఋషులందించిన మహత్తరమైన వేద సంపదను అనేక సత్యాలుగా స్తోత్ర, కథా అంశాలతో ఎన్నో తేజస్సులుగా అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తిరుమల శ్రీనివాసుని ఏకాగ్రంగా ఆరాధించడంవల్లనే అమృతశక్తుల అక్షర భారతులను ఎన్నో అందించగలుగుతున్నారని.. అలాగే అనతికాలంలోనే అనేక క్షేత్రాలకు, వేలకొలది భక్తులకు ఈ స్తోత్రరాజాలను సమర్పిస్తున్న కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య ధార్మిక సేవాసామర్ధ్యం ఆదర్శప్రాయమని తిరుమల, తిరుపతి ఆలయాలకు చెందిన అనేకమంది అర్చకులు, వేదపండితులు అభినందనలు వర్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి దంపతుల క్షేమం కోరుతూ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన కస్తూరీ చందనంలాంటి రెండు అపురూప గ్రంధాలు సుమారు ఐదువందల పుస్తకాలు కరకట్ట వద్ద ఉన్న ఉండవల్లిలోని రాష్ట్రముఖ్యమంత్రి నివాసానికి చేరాయి.
దుర్గమ్మకి బొల్లినేని సమర్పించిన పురాణపండ ‘సౌభాగ్య’ మంత్ర పేటికకు అసాధారణ స్పందన వచ్చిందని ఆలయ వర్గాలు ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చడం గమనార్హం. ఈ కారణంగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ కె.ఎస్. రామారావు, శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయ ప్రధానార్చకులకు వచ్చే సోమవారం ‘శంభో మహాదేవ’ అమోఘ గ్రంధాలను వేలకొలది ప్రతులను శివమయంగా, రుద్రమయంగా బొల్లినేని కృష్ణయ్య అందించనున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
జాతీయ స్థాయిలో పేరు పొందిన బొల్లినేని కృష్ణయ్య ఒక చారిత్రాత్మకమైన పవిత్ర కార్యం చేపట్టడం ఇటు రాజకీయ వర్గాల్ని, అటు విజ్ఞుల్ని ఆకర్షించింది. ఈ నెల తొమ్మిదవ తేదీన మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలకు ‘జయ జయోస్తు’ పలుకుతూ రెండు అపురూప మంగళ గ్రంధాలను శరవేగంగా రూపొందింపజేస్తున్నారు. అవే ‘జయ జయోస్తు’, ‘నారసింహో ... ఉగ్రసింహో’.
ఎంతో సౌజన్యమూర్తులైన వేమిరెడ్డి దంపతులు ఈ అనిర్వచనీయమైన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని కొందరికే ఇవ్వడంతో... అన్ని ఆలయాలవారూ నెల్లూరు జిల్లా అంతటా ఈ గ్రంధం కోసం ఎదురు చూస్తున్నారని... ఇందులో పురాణపండ శ్రీనివాస్ అంత వైదికమైన, ఆలయాలకు అవసరమైన మంచి కంటెంట్ అందించారని నెల్లూరు అర్చక పండితులు స్పష్టం చేస్తున్నారు.
అన్వేషణలనుండి ... అద్భుత దైవీయ స్పృహలోకి ప్రవేశించిన ప్రస్థానంలో పరమాద్భుతాలు నిస్వార్ధంగా సృష్టిస్తున్నారని ... ఈ పవిత్రతలు, అపురూపతలు నచ్చడం వల్లనే ... శ్రీనివాస్ లోని మేధ, ప్రజ్ఞ, నిస్వార్ధత కృష్ణయ్యను ఆకర్షించి ఇంతటి మహా గ్రంథ యజ్ఞ కార్యానికి బొల్లినేని కృష్ణయ్య సమర్పకులుగా వ్యవహరించారని కిమ్స్ హాస్పిటల్స్ వర్గాలు స్పష్టం చెయ్యడం గమనార్హం.ప్రశంసనీయం.
కొన్ని స్వార్ధాల మధ్య పురాణపండ శ్రీనివాస్‌తో రోజా అద్భుత పరమార్ధమే ‘శ్రీ పూర్ణిమ’. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండువారాల ముందు తన స్వగృహానికి ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్‌ని ఆహ్వానించి, తన గృహంలోని కార్యాలయంలో గంటకు పైగా చర్చలు జరిపి, సత్కరించి ఈ అద్భుతమైన ‘శ్రీపూర్ణిమ’ గ్రంధాన్ని ప్రచురించి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించారు రోజా.
ఈ సంవత్సరం భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవంలో సుమారు ముప్పైవేల శ్రీరామరక్షా స్తోత్రమ్ ప్రతులు కళ్యాణోత్సవంలో పాల్గొనే దంపతులకు, ఉభయదాతలకు, భక్తులకు అందజేయనున్నట్లు ఇప్పటికే శ్రీ సీతారామ చంద్ర దేవస్థాన జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారిని శ్రీమతి ఎల్. రమాదేవి ప్రకటించారు.
రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమ శోభాయమానంగా రూపొందించిన సౌభాగ్య దివ్య గ్రంధాన్ని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల పవిత్ర వేదికపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు ఆవిష్కరించారు.