Home » Jaya Jayosthu Book
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రానికి సమర్ధవంతమైన పాలన అందిస్తారని, అందివ్వాలని కోరుతూ.. ఇటీవల కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ‘జయ జయోస్తు’, ‘నారసింహో ... ఉగ్రసింహో’.. అనే రెండు రమణీయ గ్రంధాలను బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ సన్నిధానంలో మహాత్ములైన చాగంటి కోటేశ్వరరావు వంటి సనాతనధర్మతేజస్సుతో ఆవిష్కరించడం ఎంతో వైభవంతో వేలకొలది భక్తుల్ని ఆకర్షించింది. ఈ రెండు ఆర్ష భారతీయ దివ్య గ్రంధాలకూ పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్త కావడం.. ఈ గ్రంధాలు ఎంతో సౌందర్యంతో రూపు దిద్దుకోవడం ప్రత్యేకంగా పేర్కొనాలి. ఇప్పుడీ అపురూప దైవీయ చైతన్యపు గ్రంధాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాలను ప్రచురించాలని టీడీపీ శ్రేణులు కోరినట్లు సమాచారం.
నాల్గవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని... బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో పురాణపండ శ్రీనివాస్ రచనలైన మంగళగిరి నృసింహ భగవానునిపై ప్రచురించిన ‘నారసింహో... ఉగ్రసింహో’ దివ్యగ్రంధాన్ని, బెజవాడ కనకదుర్గా శక్తి స్వరూపంపై ప్రచురించిన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని సరస్వతీపుత్రులు, ఉపన్యాస కేసరి చాగంటి కోటేశ్వర రావు ఆవిష్కరించారు. ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ సౌందర్య వంతమైన దైవబలాల గ్రంధాలను సౌజన్యభరితంగా సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్‌కు నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి దంపతుల క్షేమం కోరుతూ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన కస్తూరీ చందనంలాంటి రెండు అపురూప గ్రంధాలు సుమారు ఐదువందల పుస్తకాలు కరకట్ట వద్ద ఉన్న ఉండవల్లిలోని రాష్ట్రముఖ్యమంత్రి నివాసానికి చేరాయి.
జాతీయ స్థాయిలో పేరు పొందిన బొల్లినేని కృష్ణయ్య ఒక చారిత్రాత్మకమైన పవిత్ర కార్యం చేపట్టడం ఇటు రాజకీయ వర్గాల్ని, అటు విజ్ఞుల్ని ఆకర్షించింది. ఈ నెల తొమ్మిదవ తేదీన మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలకు ‘జయ జయోస్తు’ పలుకుతూ రెండు అపురూప మంగళ గ్రంధాలను శరవేగంగా రూపొందింపజేస్తున్నారు. అవే ‘జయ జయోస్తు’, ‘నారసింహో ... ఉగ్రసింహో’.
ఎంతో సౌజన్యమూర్తులైన వేమిరెడ్డి దంపతులు ఈ అనిర్వచనీయమైన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని కొందరికే ఇవ్వడంతో... అన్ని ఆలయాలవారూ నెల్లూరు జిల్లా అంతటా ఈ గ్రంధం కోసం ఎదురు చూస్తున్నారని... ఇందులో పురాణపండ శ్రీనివాస్ అంత వైదికమైన, ఆలయాలకు అవసరమైన మంచి కంటెంట్ అందించారని నెల్లూరు అర్చక పండితులు స్పష్టం చేస్తున్నారు.
‘జయ జయోస్తు’ అద్భుత గ్రంధాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు, నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన సతీమణి కోవూరు తెలుగుదేశం శాసన సభ అభ్యర్థి, టి.టి.డి. సలహామండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆవిష్కరించడంతో అపురూప భక్తి సేవకు మరొకసారి నెల్లూరులో తెరలేచినట్లైంది