-
-
Home » Andhra Pradesh » Breaking News November 13th Today Latest Telugu News Live Updates Amar
-
Breaking News: నేటి తాజా వార్తలు
ABN , First Publish Date - Nov 13 , 2024 | 09:11 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-11-13T13:07:37+05:30
అసెంబ్లీలో బిల్లులు..
అసెంబ్లీ లో రెండు బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి నారాయణ
మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు - 2024 ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి
పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి నారాయణ
-
2024-11-13T12:46:52+05:30
చంద్రబాబును కలిసిన జీవీ ఆంజనేయులు
సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
చీఫ్ విప్ పదవి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబును కలిసిన జీవీ ఆంజనేయులు
అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సతీమణి లీలావతితో కలిసి చంద్రబాబును కలిసిన జీవీ
చీఫ్ విప్ పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన జీవీ ఆంజనేయులు
తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చంద్రబాబుకు తెలిపిన జీవీ
జీవీ ఆంజనేయులుకు అభినందనలు తెలిపి సమర్థంగా పనిచేయాలని సూచించిన చంద్రబాబు
-
2024-11-13T12:43:45+05:30
articleText
-
2024-11-13T12:36:14+05:30
టీ బ్రేక్ అనంతరం ప్రారంభమైన శాసనసభ
టీ బ్రేక్ అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభ సమావేశాలు
మున్సిపల్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి నారాయణ
-
2024-11-13T12:29:55+05:30
వారిపై హైకోర్టు అభ్యంతరం
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారి పై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ వేయడం పై హైకోర్ట్ అభ్యంతరం
అసభ్యకర పోస్టుల పెట్టినవారి పై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని ప్రశ్న
ఒక దశలో న్యాయమూర్తులను అవమానపర్చేలా పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించిన ధర్మాసనం
పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ
పోలీసులు కట్టిన కేసులు పై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టు ను ఆశ్రయించవచ్చని వెల్లడి
అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి పై పోలీసులు నిభందనలకు అనుగుణంగా కేసులు పెడుతుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్య
-
2024-11-13T12:21:05+05:30
రఘురామకు పదవిపై హర్షం
అసెంబ్లీ లాబీలో ఎంఎల్ఏ రఘురామరాజు సందడి
రఘురామ రాజు కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తుండటంతో కూటమి పక్షాల ఎమ్మెల్యేల అభినందనలు
ఇన్నర్ లాబీల్లోకి వెళ్లి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు, మంత్రులు
ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు కేటాయించిన ఛాంబర్ ను రఘురామ రాజు కు కేటాయించిన అసెంబ్లీ అధికారులు
ఛాంబర్ ను పరిశీలించిన రఘురామ రాజు సిబ్బంది
రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్
రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు నామినేషన్లు వేసేందుకు సమయం
రేపు మధ్యాహ్నం 2.39 గంటలకు రఘురామ రాజు నామినేషన్
అసెంబ్లీ లో ఎన్డీఏ పక్షాలకు 164 మంది మెజార్టీ ఉండటంతో రఘురామ ఎన్నిక లాంఛనమే
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుకు డిప్యూటీ స్పీకర్ పదవిపై కూటమి నేతల హర్షం
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కూటమి వైపు ఓటర్లను ఆకర్షించడంలో రఘురామ పాత్ర ఎనలేనిదన్న బీజేపీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి
ఎన్నో అవమానాలను, చిత్రహింసలను ఎదుర్కొని వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారన్న వీరన్న చౌదరి
ఆసల్యంగానైనా రఘురామకు పదవి దక్కడంపై హర్షం
వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రఘురామ కీలక భూమిక పోషించారన్న బీజేపీ నేత
-
2024-11-13T12:08:09+05:30
బతుకమ్మ కుంట చేరుకున్న హైడ్రా కమీషనర్
అంబర్ పేట్ బతుకమ్మ కుంట చేరుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.
ఆక్రమణలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన హైడ్రా చీఫ్ రంగనాథ్.
రంగనాథ్ తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, జిహెచ్ఎంసి అధికారులు.
రంగనాథ్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరింపు
ఇళ్లను తొలగించకుండా చెరువు సుందరీ కరణ పనులు చేయాలంటూ స్థానికుల డిమాండ్
-
2024-11-13T11:06:43+05:30
ఏసీబీ అధికారుల దాడులు
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలొ ఏసీబీ అధికారుల దాడులు,
రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జునియర్ అసిస్టెంట్ షాఖీర్
బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న భరత్ అనే ఉద్యోగి సర్వీస్ బుక్ ఎంట్రి నిమిత్తం డబ్బులు డిమాండ్ చేసిన షఖీర్
-
2024-11-13T09:41:26+05:30
వైసీపీ అవివేకంతోనే..
వైసీపీ అవివేకంతో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారన్న హోమంత్రి అనిత
సలహాదారుల ఉచిత సలహాతో ప్రభుత్వం తుగ్గక్ నిర్ణయాలు తీసుకుందన్న అనిత
పరోక్షంగా సజ్జలపై హోమంత్రి సెటైర్లు
-
2024-11-13T09:33:29+05:30
సచివాలయంలో మహిళా పోలీసులపై..
సచివాలయంలో మహిళా పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు అడిగిన ఎమ్మెల్యేలు కూన రవికుమార్, తంగిరాల సౌమ్య, గౌరు చరితా రెడ్డి, మిరియాల శిరీష దేవి, రెడ్డప్పగారి మాధవి, ఎన్ విజయశ్రీ
సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన హోమంత్రి వంగలపూడి అనిత
గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ వివరాలు తెలపాలని కోరిన ఎమ్మెల్యేలు
మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో గందరగోళం నెలకొందన్న సభ్యులు
మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏ విభాగానికి జవాబుదారీగా ఉండాలో స్పష్టం చేయాలన్న ఎమ్మెల్యేలు
ఆరు విభాగాలకు వీరిని జవాబుదారీగా చేయడం దారుణమన్న సభ్యులు
-
2024-11-13T09:27:05+05:30
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం
తొలుత ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన స్పీకర్
చింతలపూడి ఎత్తిపోతల పథకంపై ప్రశ్నలు అడిగిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు