Share News

Budda Venkanna : జోగితో మంత్రి ర్యాలీ బాధాకరం!

ABN , Publish Date - Dec 18 , 2024 | 05:31 AM

ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ నేత జోగి రమేశ్‌తో కలిసి టీడీపీ నాయకులు, మంత్రి ర్యాలీలో పాల్గొనడం బాధాకరమని...

Budda Venkanna : జోగితో మంత్రి ర్యాలీ బాధాకరం!

  • క్యాడర్‌కు పార్ధసారథి, కొనకళ్ల, శిరీష సమాధానం చెప్పాలి: బుద్దా

విజయవాడ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ నేత జోగి రమేశ్‌తో కలిసి టీడీపీ నాయకులు, మంత్రి ర్యాలీలో పాల్గొనడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లటం, నీచంగా మాట్లాడటంతోపాటు చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేశ్‌ అన్నారు. నాటి దృశ్యాలను ఫ్లెక్సీపై ముద్రించిన బుద్దా వెంకన్న వాటిని విలేకరులకు చూపించారు. జోగితో టీడీపీ నేతలు వేదికను పంచుకున్న ఘటన చంద్రబాబు గుండెలపై తన్నినట్టు తనకు అనిపిస్తోందన్నారు. ఇలా జరగకుండా ఉండాల్సిందని చెప్పారు. జోగి రమేశ్‌ను చూసిన తర్వాతైనా వేదిక నుంచి, ర్యాలీ నుంచి దూరంగా వచ్చేసి ఉంటే బాగుండేదన్నారు. పార్ధసారథి, కొనకళ్ల నారాయణ, శిరీష ముగ్గురూ సౌమ్యులేనని, క్షమాపణ చెబితే సరిపోదని, క్యాడర్‌కు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.

Updated Date - Dec 18 , 2024 | 05:31 AM