Share News

Floods: తెలుగు రాష్ట్రాలకు సాయంపై హోంశాఖ కీలక ప్రకటన

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:36 PM

వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సాయం అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దాంతో కేంద్ర హోం శాఖ రంగంలోకి దిగింది. సహాయక చర్యల్లో పాల్గొంది. తెలుగు రాష్ట్రాలకు అందజేసిన వరద సాయం గురించి హోం శాఖ శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

Floods: తెలుగు రాష్ట్రాలకు సాయంపై హోంశాఖ కీలక ప్రకటన
floods in andhra pradesh, telangana

ఢిల్లీ: వరదలు (Floods) తెలుగు రాష్ట్రాలను ముంచెత్తాయి. వరదనీటితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సాయం అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దాంతో కేంద్ర హోం శాఖ రంగంలోకి దిగింది. సహాయక చర్యల్లో పాల్గొంది. తెలుగు రాష్ట్రాలకు అందజేసిన వరద సాయం గురించి హోం శాఖ శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసింది.


Bezawada-Floods-1.jpg


ప్రధాని ఆదేశాలతో..

ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందజేశాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అవసరమైన పూర్తి సహకారం అందజేస్తోన్నాం. వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ భద్రతను అంచనా వేయడానికి, వరద నుంచి తక్షణ ఉపశమనం కోసం సిఫార్సు చేయడానికి కేంద్ర నిపుణుల బృందాన్ని విజయవాడకు పంపించాం. వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి హోం శాఖ ఆధ్వర్యంలో ఇంటర్-మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT)ని ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎఫ్‌కి చెందిన 26 బృందాలు, వైమానిక దళానికి చెందిన 8 హెలికాప్టర్లు, నౌకా దళానికి చెందిన 3 హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ పాల్గొన్నాయి అని’ కేంద్ర హోం శాఖ ప్రకటన చేసింది.


pm Modi.jpg


వైమానిక దళాల సేవలు

తెలంగాణలో సహాయ, పునరావాస కార్యకలాపాల కోసం 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 వైమానిక దళాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు 350 మందిని రక్షించాయి. 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తెలంగాణలో 68 మందిని రక్షించి 3200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి అని’ కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు చిగురటాకులా వణికాయి. తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


Floods.jpg

Updated Date - Sep 06 , 2024 | 04:36 PM