Chandrababu: సభ్యుల హర్షధ్వానాల నడుమ సభలోకి అడుగు పెట్టిన చంద్రబాబు
ABN , Publish Date - Jun 21 , 2024 | 10:29 AM
గౌరవ సభలోకి సీఎం చంద్రబాబు అడుగు పెట్టగానే.. సభ్యులు లేచి నుంచొని హర్షధ్వానాలు చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు స్వాగతం పలికారు. అంతకు ముందు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద సీఎంకు స్వాగతం పలికారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి చంద్రబాబు నమస్కారం చేశారు. భావోద్వేగ సన్నివేశంతో అనేక మంది ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు.
అమరావతి: గౌరవ సభలోకి సీఎం చంద్రబాబు అడుగు పెట్టగానే.. సభ్యులు లేచి నుంచొని హర్షధ్వానాలు చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు స్వాగతం పలికారు. అంతకు ముందు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద సీఎంకు స్వాగతం పలికారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి చంద్రబాబు నమస్కారం చేశారు. భావోద్వేగ సన్నివేశంతో అనేక మంది ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. అసెంబ్లీ లోపలికి పూర్ణ కుంభంతో చంద్రబాబుకు వేద పండితులు స్వాగతం పలికారు. తన ఛాంబర్ లోకి వచ్చిన వెంటనే.. చంద్రబాబుకు పండితులు ఆశీర్వచనం పలికారు.
ఛాంబర్‌లో సీట్‌లో కూర్చొన్న వెంటనే పండితులు ఆశీస్సులు అందించారు. అనంతరం అసెంబ్లీలోకి చంద్రబాబు అడుగు పెట్టారు. చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వెంటనే హర్షధ్వానాలతో లేచి నిలుచొని మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు పలికారు. సరిగ్గా 2021 నవంబర్ 19 న చంద్రబాబు తన సతీమణిని అవమానించి మాట్లాడటంతో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. కౌరవ సభను గౌరవ సభగా చేసి తిరిగి ముఖ్యమంత్రిగా ఈ సభలో అడగు పెడతానని చంద్రబాబు శపథం చేసిన వెళ్లిపోయారు. ఇవాళ మళ్ళీ ఈ రోజు సీఎంగా సభలో చంద్రబాబు అడుగుపెట్టారు.