Share News

AP Elections 2024: మద్య నిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతావు.. జగన్‌కు బాబు సూటి ప్రశ్న

ABN , Publish Date - Apr 27 , 2024 | 10:37 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శనివారం మద్య నిషేధంపై(Liquor Ban) సీఎం జగన్‌ను(CM Jagan) ఎక్స్ లో సూటిగా ప్రశ్నించారు.

AP Elections  2024: మద్య నిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతావు.. జగన్‌కు బాబు సూటి ప్రశ్న

అమరావతి: వైసీపీ 2019 ఎన్నికల సందర్భంగా చేసిన ప్రధాన హామీల్లో ఒకటి మధ్య నిషేధం. ఆ హామీని నెరవేర్చని వైసీపీ.. పిచ్చి పిచ్చి బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీసేస్తోంది. నిషేధం దేవుడెరుగు.. ప్రాణాలు పోయే మందుతాగలేమని బెంబేలెత్తిపోతున్నారు.

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శనివారం మద్య నిషేధంపై(Liquor Ban) సీఎం జగన్‌ను(CM Jagan) ఎక్స్ లో సూటిగా ప్రశ్నించారు. మద్య నిషేధం చేయకుండా వైసీపీ ప్రజలను ఓట్లు ఎలా అభ్యర్థిస్తుంది అని అన్నారు.


"మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నావ్. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే... 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న నువ్వు...ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావు?" అని సీబీఎన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Andhra Pradesh and Telugu News Here

Updated Date - Apr 27 , 2024 | 10:37 AM