Chandrababu: రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే బీజేపీతో కలిశా.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్
ABN , Publish Date - Apr 06 , 2024 | 06:21 PM
రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నామని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీని సీఎం జగన్ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. జగన్ రాజకీయం అంటే అరాచకం.. దోచుకోవడం.. దాచుకోవడమేనని మండిపడ్డారు. జగన్ అనాలోచిత చర్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ధ్వజమెత్తారు.
పల్నాడు: రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నామని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీని సీఎం జగన్ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. జగన్ రాజకీయం అంటే అరాచకం.. దోచుకోవడం.. దాచుకోవడమేనని మండిపడ్డారు. ‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా శనివారం నాడు గుంటూరు జిల్లాలోని పెదకూరపాడులో భారీ బహిరంగ సభలో సీఎం జగన్ (CM Jagan), వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
Yanamala: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇక అధోగతే
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు తెలుగు తమ్ముళ్లు బ్రహ్మరథం పట్టారు. ఈ సభలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా పాల్గొన్నారు. జగన్ అనాలోచిత చర్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తుంది కాబట్టే.. ఆ పార్టీతో కలిశానని చంద్రబాబు స్పష్టం చేశారు.
Sajjala: ఆ వృద్ధులు చనిపోయింది ప్రమాదవశాత్తూ మాత్రమే.. చంద్రబాబుపై సజ్జల విమర్శలు
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది తమ కోసం కాదని రాష్ట్రం క్షేమం కోసమని చెప్పారు. రావణాసురుడిని చంపేందుకు వానర సైన్యమంతా కలిసిందని ఆక్షేపించారు. రాముడు దేవుడు అయినప్పటికీ వానరులతో కలిసి పోరాడారని చెప్పారు. వైసీపీ దోపిడీ దొంగలు కృష్ణా నది మీదనే రోడ్డు వేశారని విరుచుకుపడ్డారు. ఇసుకాసురుడిని అంతం చేసి పేదలకు ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని తెలిపారు. ఆనాడు తాను చేసిన కృషితో ఇవాళ హైదరాబాద్ నంబర్‌వన్‌గా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
YS Jagan: మళ్లీ తెర మీదకు అదే రాజకీయం..!
మరిన్ని ఏపీ వార్తల కోసం...