Loksabha Elections 2024: వారణాసికి చంద్రబాబు.. ఎందుకంటే..?
ABN , Publish Date - May 14 , 2024 | 08:59 AM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారణాశి బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావించింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలని బీజేపీ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అనంతరం అక్కడ జరిగే ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) వారణాశి బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావించింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలని బీజేపీ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అనంతరం అక్కడ జరిగే ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారణాశి చేరుకున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
EVMs: ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత
ప్రధాని మోదీ నామినేషన్ సమర్పణ కార్యక్రమ అనంతరం ఎన్డీఏ పక్షాలతో ఇక్కడ ఒక భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేశారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. మోదీ తొలిసారిగా వారణాశి నుంచి పోటీ చేస్తున్నందున ఇక్కడ భారీ రోడ్ షో సైతం నిర్వహించనున్నారు. వారణాశిలో బహిరంగ సభ తదితర కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి చంద్రబాబు నేటి సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. రోడ్‌షోలో ఆయన వెంట యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఉన్నారు. ప్రధానమంత్రికి ఆహ్వానం పలుకుతూ, కనీసం వంద చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు
Read Latest AP News and Telugu News