AP News: తిరువూరు గర్ల్స్ హై స్కూల్‌కు చేరుకున్న ఈవీఎం, బ్యాలెట్ బాక్సులు
ABN , Publish Date - May 14 , 2024 | 08:54 AM
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల నిబంధన మేరకు సాయంత్రం 6గంటలకే పోలింగ్ సమయం ముగిసింది. అచితూ క్యూ లైన్ లో ఉన్నవారికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో రాత్రి 11:40 వరకు పట్టణంలోని చింతలకాలనీలో 82 నెంబర్ బూత్‌లో ఓటింగ్ కొనసాగింది.
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల నిబంధన మేరకు సాయంత్రం 6గంటలకే పోలింగ్ సమయం ముగిసింది. అచితూ క్యూ లైన్ లో ఉన్నవారికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో రాత్రి 11:40 వరకు పట్టణంలోని చింతలకాలనీలో 82 నెంబర్ బూత్‌లో ఓటింగ్ కొనసాగింది. పోలింగ్ ముగియడంతో పోలింగ్ సామగ్రితో ఈవీఎంలతో స్ట్రాంగ్ రూంలకు ఎన్నికల సిబ్బంది చేరుకుంటోంది. 29 రూట్లలో 53 బస్సుల్లో ఎస్కార్ట్ భద్రతతో తిరువూరు గర్ల్స్ హై స్కూల్‌కు చేరుకుని ఆర్వో సమక్షంలో ఈవీఎం, బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూములలో సిబ్బంది భద్రత పరచడం జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు
Read Latest AP News and Telugu News