Share News

Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు

ABN , Publish Date - Sep 06 , 2024 | 12:23 PM

Andhrapradesh: రాసలీలల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బలాత్కారం... బెదిరించి రేప్ చేయడంపై కేసు నమోదు అయ్యింది. నిన్న (గురువారం) రాత్రి 11:15 గంటలకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు
A case has been registered against Satyavedu MLA Adimulam

తిరుపతి, సెప్టెంబర్ 6: రాసలీలల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై (MLA Koneti Adimulam) తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బలాత్కారం... బెదిరించి రేప్ చేయడంపై కేసు నమోదు అయ్యింది. నిన్న (గురువారం) రాత్రి 11:15 గంటలకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే ఈస్ట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. సంఘటన జరిగిన బీమాస్ పారడైజ్ హోటల్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఆ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఎఫ్‌ఐఆర్ నెంబర్ 430/24, డేట్: 5-9-2024 కింద ఎమ్మెల్యే ఆదిమూలంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

YS Jagan: వైఎస్ జగన్‌కు ఊహించని షాక్.. పాస్‌పోర్ట్ రద్దు


చట్టపరమైన చర్యలకు...

కాగా.. ఈ వ్యవహారానికి సంబంధించి చట్ట పరమైన చర్యల తీసుకునేందుకు నిన్న(గురువారం) ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై పార్టీకి చెందిన మహిళ కార్యకర్త లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది. కొన్ని ప్రైవేటు వీడియోలను సైతం బాధితురాలు రిలీజ్ చేసింది. గురువారం నాడు హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు బాధితురాలు, తన భర్తతో కలిసి వచ్చి ఆదిమూలం లైంగిక వేధింపుల పర్వాన్ని బయటపెట్టింది. తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌కు లేఖ రాశానని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు చెప్పింది. తాము కూడా టీడీపీకి చెందిన వారమేనని బాధితురాలు తెలిపింది.

Heavy Rains: భారీ వర్షాలతో తెలంగాణ ఏ రేంజ్‌లో నష్టం జరిగిందంటే?


టీడీపీ హైకమాండ్ సీరియస్..

అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేస్తున్నట్లు నిన్న (గురువారం) టీడీపీ హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఈ రోజు వివిధ మాద్యమాలలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది’ అని టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయ్యింది. అలాగే సస్పెన్షన్ తరువాత వివరణ తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. ఆరోపణలు తీవ్రత దృష్ట్యా ముందు సస్పెండ్ చేసి తరువాత వివరణ తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆదిమూలం వ్యవహారంపై సీనియర్ నేతలు చంద్రబాబుకు తెలియజేయగా... బాబు సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకోవాలని.. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి భయపడేలా ఆచర్యలు ఉండాలని ఆదేశించారు. అనంతరం గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది.


ఇవి కూడా చదవండి..

Dr. Tamilisai: పాలన చేతగాకే సైకిల్‌ తొక్కుతున్నారు..

Heavy Rains: భారీ వర్షాలతో తెలంగాణ ఏ రేంజ్‌లో నష్టం జరిగిందంటే?

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 06 , 2024 | 12:36 PM