Amarnath Reddy: అవినీతిపై ప్రశ్నిస్తే ఆ ఎమ్మెల్యేను పెద్దిరెడ్డి బెదిరించలేదా..?
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:30 PM
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) అవినీతిపై.. వైసీపీ ఎమ్మెల్యేలే ఎదురుదాడికి దిగుతున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి(Amarnath Reddy) అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లు వేస్తాం, రాళ్లతో కొట్టిస్తాం అంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమర్నాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) అవినీతిపై.. వైసీపీ ఎమ్మెల్యేలే ఎదురుదాడికి దిగుతున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి(Amarnath Reddy) అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లు వేస్తాం, రాళ్లతో కొట్టిస్తాం అంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమర్నాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అవినీతి చిట్టాను క్లీన్‌గా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బయటపెట్టారన్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం అన్ని రకాలుగా దోపిడీ, లూటీ చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పెద్దిరెడ్డి అవినీతిని బయటపెట్టారని.. ఈ విషయంపై ఆయన సమాధానం చెప్పగలరా...? అని అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు.
దళిత నియోజకవర్గాల్లోనే పెద్దిరెడ్డి కుటుంబం ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, దళిత ఎమ్మెల్యేలను అణగ దొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి, వైసీపీ నేతల అవినీతిపై పూతలపట్టు దళిత ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ప్రశ్నిస్తే ఆయనను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. మరో మంత్రి రోజాపై అదే పార్టీలోని బాధితులు ఎలా ఎదురు తిరుగుతున్నారో చూస్తునే ఉన్నామన్నారు. లంచాల మంత్రిగా రోజా మారిపోయారని విమర్శించారు. ఇలా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వైసీపీ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో.. ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఊదాహరణగా చెప్పవచ్చని అన్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం వైసీపీ అరాచకాలే అని అమర్నాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...