Share News

SIT: టీటీడీ లడ్డూ వివాదం.. సిట్‌ విచారణకు బ్రేక్

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:53 PM

Andhrapradesh: టీటీడీ లడ్డూ వ్యవహారానికి సబంధించి సుప్రీం కోర్టు తీర్పు తరువాత తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు. మూడు రోజుల దర్యాప్తుపై సిట్ చీఫ్ నివేదిక ఇచ్చారన్నారు.

SIT: టీటీడీ లడ్డూ వివాదం.. సిట్‌ విచారణకు బ్రేక్
SIT investigation in the TTD laddu dispute is being stopped

తిరుమల, అక్టోబర్ 1: తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) నియమించింది. ఈ వ్యవహారంపై సిట్‌ బృందం ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. గత శనివారం (సెప్టెంబర్ 28) తిరుమలకు చేరుకున్న సిట్ బృంద సభ్యులు మూడు రోజులు దర్యాప్తు జరిపారు. తాజాగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Komatireddy Venkatreddy: మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రత్యక్ష ఉద్యమమే..


దర్యాప్తు ఊపందుకుంటున్న క్రమంలో ప్రభుత్వ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిట్ విచారణకు బ్రేక్ వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి సిట్ విచారణను నిలిపివేస్తున్నట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. టీటీడీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు తరువాత దర్యాప్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు. మూడు రోజుల దర్యాప్తునకు సంబంధించిన నివేదికను సిట్ చీఫ్ అందజేశారని వివరించారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ శాఖ దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.


విచారణ కొనసాగింది ఇలా..

కాగా... గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు, తిరుపతి అడ్మిన్‌ ఏఎస్పీ వెంకటరావు, డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, అన్నమయ్య జిల్లా ఎస్‌బీ సీఐ సత్యనారాయణ, విజయవాడ సీఐ ఉమా మహేశ్వర్‌, చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ సూర్యనారాయణ సభ్యులుగా ‘సిట్‌’ ఏర్పడిన సంగతి తెలిసిందే. శనివారం (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం విజయవాడ నుంచి వందేభారత్‌ రైలులో సిట్‌ అధికారులు తిరుపతి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి... శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపై టీటీడీ కార్యనిర్వహణాధికారితో పాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించిన ప్రాథమిక సమాచారం సేకరించారు.

Laxman: కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది



టీటీడీ ఈవోతో గంట పాటు...

గత మూడు రోజులుగా సిట్ అధికారులు వేర్వేరుగా విచారణను చేపట్టారు. విచారణలో భాగంగా టీటీడీకి చెందిన పలువురు ఉన్నతాధికారులతో సిట్ బృందం సభ్యులు సమావేశమై పలు ప్రశ్నలు సంధించారు. అలాగే టీటీడీ ఈవో శ్యామలారావుతో కూడా సిట్ బృందం భేటీ అయ్యింది. సుమారు గంటపాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. నెయ్యి సరఫరాలో ప్రమేయం ఉన్న వారందరినీ విచారించాలని సమావేశంలో నిర్ణయించారు.

Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ


మురళి నుంచి కీలక సమాచారం..


తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో టీటీడీ మార్కెటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తును మొదలుపెట్టిన సిట్ అధికారులు.. మురళీకృష్ణను తిరుపతిలోని పోలీస్‌ గెస్ట్‌హౌస్‌కు పిలిపించుకుని విచారించారు. మురళీకృష్ణ నుంచి కీలక సమాచారాన్ని సిట్ టీమ్ రాబట్టింది. మురళీకృష్ణ ఫిర్యాదులో ఏఆర్ డెయిరీ, టీటీడీకి మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించారు. దాంతో పాటు నెయ్యిలో కల్తీ జరిగిన పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరిచారు. అలాగే ఏఆర్ డెయిరీకి సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ నుంచి తీసుకున్నట్లు సీట్ విచారణ బృందం ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు త్రిపాఠి తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

Tirumala Laddu: టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీంలో కేఏపాల్ పిటిషన్

Kadambari Jethwani: నటి జెత్వానీ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 04:54 PM