Share News

YCP leader: వైసీపీ నేత ఇంటిపై దాడికి యత్నం!

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:36 AM

పెళ్లకూరు మండలం చిల్లకూరులోని ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు.

YCP leader: వైసీపీ నేత ఇంటిపై దాడికి యత్నం!
కారుకు అడ్డుగా కుర్చున్న వైసీపీ కార్యకర్తలు

మూడు గంటల పాటు కారులో టీడీపీ నాయకుడి నిర్బంధం

అర్ధరాత్రి వరకు చిల్లకూరులో ఉద్రిక్తత

నాటి వైసీపీలో గ్రూపు గొడవలే కారణమా?

పెళ్లకూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): పెళ్లకూరు మండలం చిల్లకూరులోని ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు టీడీపీ నేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వీరు గతంలో వైసీపీలో ఉండి.. ప్రస్తుతం టీడీపీలో చేరిన వారు కావడం గమనార్హం. నాడు వైసీపీలోని గ్రూపు విభేదాలే.. ఇప్పుడూ కొనసాగుతూ ఈ సంఘటనకు కారణమైందని సమాచారం. వివరాలిలా ఉన్నాయి. సొంత పనులపై ఆదివారం సత్యనారాయణరెడ్డి బయటకు వెళ్లారు. సాయంత్రం 7 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన గతంలో వైసీపీలో ఉండి ప్రస్తుతం టీడీపీలో చేరిన దువ్వూరు రాకే్‌షరెడి,్డ దయాకర్‌తో పాటు టీడీపీకి చెందిన శిరసనంబేడు గ్రామస్థుడు శిరసనంబేటి చైతన్యకృష్ణారెడ్డి, పునబాకకు చెందిన లోకే్‌షనాయుడు కలిసి సత్యనారాయణరెడ్డి నివాసానికి చేరుకున్నారు. వీరిలో రాకే్‌షరెడ్డి, దయాకర్‌.. కామిరెడ్డి ఇంటిపై దాడికి యత్నించినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సత్యనారాయణరెడ్డి సతీమణి ప్రభావతమ్మ కేకలు వేయడంలో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. ఆ ఇంటి గేట్లకు తాళాలు వేసి కారులో వెళ్లేందుకు చైతన్యకృష్ణారెడ్డి, రాకే్‌షరెడ్డి, లోకే్‌షనాయుడు ప్రయత్నించగా, గ్రామస్థులతో పాటు వైసీపీ కార్యకర్తలు కారును చుట్టుముట్టారు. నాయుడుపేట సీఐ సంగమేశ్వరరావు, అర్బన్‌ సీఐ బాబీ, ఎస్‌ఐ శ్రీహరి, ఓజిలి ఎస్‌ఐ అజయ్‌కుమార్‌, సిబ్బంది చిల్లకూరు చేరుకున్నారు.


కారును చుట్టుముట్టిన గ్రామస్తులను, వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినా, గ్రామస్తులు లేవకపోవడంతో పోలీసులు.. కారులో ఉన్న రాకేష్‌, లోకే్‌షను చాకచక్యంగా తప్పించి పోలీస్‌ వ్యాన్‌లో తీసుకెళ్లారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహించి.. బయట ఊరినుంచి ఇక్కడ గొడవలు పెడుతున్నారని చైతన్యకృష్ణారెడ్డిని తీసుకెళ్లకుండా అడ్డుపడ్డారు. ట్రాక్టర్లు, మోటార్‌ సైకిళ్లు, ఎడ్లబండ్లను కారుకు అడ్డుపెట్టి మూడు గంటల పాటు చైతన్యకృష్ణారెడ్డిని నిర్బంధించారు.ఎట్టికేలకు పోలీసులు ఆయన్ను రాత్రి 11.30 గంటలకు కారులో తరలించారు. దీంతో గ్రామంలో ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్తత నెలకొంది. గతంలో వైసీపీలో గ్రూపు గొడవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 01:36 AM