Chevireddy : మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు
ABN , Publish Date - Nov 26 , 2024 | 09:07 AM
మైనర్ బాలికపై అటమ్ట్ రేప్ జరిగిందని దుష్ర్పచారం చేయడంతో.. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు బాలిక భవిష్యత్‌ను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
తిరుపతి: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)పై కేసు నమోదు అయింది. మైనర్ బాలిక విషయంలో దుష్ప్రచారం చేశారని బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు (Police) పోక్సో, అట్రాసిటి (POCSO, Atrocity) కేసు (Case) నమోదు చేశారు. కేసు నమోదు చేసిన యర్రావారిపాళెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మైనర్ బాలికపై అటమ్ట్ రేప్ జరిగిందని దుష్ర్పచారం చేయడంతో.. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు బాలిక భవిష్యత్‌ను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
అలాగే చెవిరెడ్డి తన అనుచరులతో ఈ కుట్రకు పాల్పడి.. బాలికపై చేసిన దుష్ప్రచారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతికి సంబంధించి.. వచ్చిన కొత్త చట్టం ప్రకారం 352, 351/2, 196, 61/2, 353 తదితర సెక్షన్లకింద కేసు నమోదు చేశారు. దాంతో పాటు ఫోక్సో, ఎస్టీ, ఎస్సీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం దళిత కుటుంబం కావడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన రోజు వైఎస్సార్సీపీకి చెందిన మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. ఇలాంటివి పునరావృతం కాకూడదంటే ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News