Home » Chevireddy Bhaskar Reddy
Shock In YCP : వైసీపీలో అగ్రనేతలకు అండగా ఉన్న.. నేతలంతా తమ తమ అనుచర గణంతో పార్టీలు మారుతోన్నారు. దీంతో వైసీపీ నుంచి ఇతర పార్టీలకు వలసలు వెల్లువెత్తాయి.
AP Highcout: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఫోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెవిరెడ్డిపై తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు పెట్టారు.
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ అవాస్తవ ఆరోపణలతో ఆయన దుష్ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
తామెవరి మీదా కేసు పెట్టలేదని, తన కూతురిపై దాడి జరిగితే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తామే పిలిచామని లైంగికదాడి ఘటనపై బాలిక తండ్రి స్పష్టం చేశారు.
మైనర్ బాలికపై అటమ్ట్ రేప్ జరిగిందని దుష్ర్పచారం చేయడంతో.. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు బాలిక భవిష్యత్‌ను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
కొండేపి నుంచి ఒంగోలుకు వచ్చి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోటీ చేశారని వైసీపీ సీనియర్ నేత చెవి రెడ్డి భాస్కర్ రెడ్ ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హనానికి ఇలా మాట్లాడటం బాలినేనికి తగదని చెవిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతల్లో ఏ ఒక్కరికి లేదని అన్నారు. సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా గత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయ స్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత తిరుపతి జిల్లాలో జరిగిన దాడులు అన్ని ఇన్ని కావు. మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి నాని (Pulivarthi Nani)పై.. వైసీపీ నుంచి బరిలోకి దిగిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, అతని అనుచరులు దాడికి తెగబడి కార్లను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నం చేశారు.
తిరుపతి: తన కుమారుడు మోహిత్ రెడ్డి వయస్సు 25 ఏళ్లు అని, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడని, సంఘటన జరిగిన 52 రోజుల తర్వాత రాజకీయ కక్షతో తన కుమారుడిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.