Home » Kanipakam
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఆన్లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం ద్వారా ఆలయానికి రూ.4,44,49,759 ఆదాయం లభించినట్లు ఈవో గురుప్రసాద్ తెలియజేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు వరసిద్ధుడి ఆలయానికి విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.
కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో శుక్రవారం వరసిద్ధుడు విమాన వాహనంపై విహరించారు.
బెంగళూరు.. తిరుపతి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. స్నేహితుని జన్మదినానికి కోసం కాణిపాకం నుంచి బైక్పై కేక్ తీసుకొస్తుండగా చెర్లోపల్లి సమీపంలో మినీ లారీని బైక్ ఢీ కొట్టింది. బంగారుపాలెం మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన పవన్, మంజు, చరణ్ ముగ్గురు స్నేహితులు మృతి చెందారు.
కాణిపాకంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భవనాన్ని రెవెన్యూ, ఆలయ అధికారులు కూల్చివేశారు. భవనం కూల్చివేతపై స్థానికులు, రైతులు ,టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్ నుంచి భక్తులను పంపుతున్నారు.
చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వెండి విభూది పట్టి మాయమైన వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర్ గురుకుల్ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మెమో జారీ చేశారు.