Share News

MLA Adimulam Koneti: సంచలన విషయాలు బయటపెట్టిన ఆదిమూలం కుమార్తెలు

ABN , Publish Date - Sep 05 , 2024 | 08:18 PM

తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఆయనపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను మీడియాకు విడుదల చేసింది.

MLA Adimulam Koneti: సంచలన విషయాలు బయటపెట్టిన ఆదిమూలం కుమార్తెలు

తిరుపతి: తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఆయనపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను మీడియాకు విడుదల చేసింది. అయితే, ఈ విషయంపై ఆదిమూలం ఇద్దరు కుమార్తెలు ప్రభ, శోభ, ఆయన అల్లుడు కెన్నెడీ స్పందించారు. ఈరోజు(గురువారం) మీడియా సమావేశంలో ఆదిమూలానికి సంబంధించిన పలు కీలక విషయాలను మీడియాకు ఆదిమూలం ఇద్దరు కుమార్తెలు ప్రభ, శోభ, ఆయన అల్లుడు కెన్నెడీ వెల్లడించారు.


ALSO READ: AP FLOODS: మళ్లీ పొంగిన బుడమేరు.. రాకపోకలకు అంతరాయం

వైసీపీ నేతల కుట్ర..

‘‘ఆదిమూలానికి హార్ట్ ఎటాక్ వచ్చి ఆపరేషన్ జరిగింది. కోవిడ్ కూడా వచ్చింది. అప్పటి నుంచి ఒక అల్లుడుగా ఆయన పక్కనే ఎప్పుడు ఉంటాను. ఎవరు నమ్మలేని విషయం ఇది. అది ఫేక్ వీడియో, ఈ వీడియో వెనుక వైసీపీ నేతల కుట్ర ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమె మాటలు నమ్మకూడదు. సత్యవేడులో జరిగిన కుట్ర ఎక్కడ జరగలేదు. కడిగిన ముత్యంలా ఈ కుట్ర నుంచి ఆదిమూలం బయటకు వస్తారు. ఆయన మచ్చ లేని వ్యక్తి. ఆమె మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆదిమూలంకు సపోర్ట్ చేయలేదు. ఆమెపైన హై కమాండ్ చర్యలు తీసుకోవాలి. కూతురు వయసు ఉన్నామే ఆయన పైన ఇలాంటి అభియోగాలు మోపడం దేవుడు కూడా క్షమించడు. ఆమె వెనుక ఎవరో ఉండి ఈ ఆరోపణలు చేయించారు. కుటుంబానికి కూడా సమయం కేటాయించకుండా ప్రజలకోసం ఆదిమూలం నిరంతరం పనిచేశారు’’ అని ఆదిమూలం అల్లుడు, కుమార్తెలు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు వైరల్ ఫీవర్

AP Politics: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్..

Narayana: రేపే నిత్యవసరాల పంపిణీ.. మంత్రి నారాయణ సమీక్ష

Viral Video: సింహానికీ మనసుంటుంది.. పిల్ల సింహం నీళ్లలో పడడంతో తల్లి ఏం చేసిందో చూస్తే..

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 09:20 PM