Share News

Ambati: శ్రీవారి ఆలయంలో అంబటి హల్‌చల్

ABN , Publish Date - Nov 04 , 2024 | 01:39 PM

Andhrapradesh: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారిని దర్శించుకునే సమయంలో అంబటి ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అంబటిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Ambati: శ్రీవారి ఆలయంలో అంబటి హల్‌చల్
Minister Ambati Rambabu

తిరుమల, నవంబర్ 4: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) తిరుమలలో హల్‌చల్ చేశారు. ఈరోజు (సోమవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు మాజీ మంత్రి. అయితే శ్రీవారి దర్శించుకునే సమయంలో ఆయన ప్రవర్తించిన తీరు భక్తులకు కూడా ఆగ్రహం తెప్పించింది. తిరుమలలో ఉన్న సంప్రదాయాలను పట్టించుకోకుండా అంబటి శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ తిరుమలలో అంబటి ఏం చేశారో ఇప్పుడు చూద్దాం.

CM Chandrababu: ఇలా అయితే ఆల్టర్నేట్ తప్పదు.. మంత్రికి సీఎం వార్నింగ్..


మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయితే జగన్ బ్యాడ్జ్‌తో శ్రీవారి ఆలయం వద్ద అంబటి హల్‌చల్ చేశారు. జగన్ బొమ్మతో పాటు పార్టీ గుర్తు వున్న బ్యాడ్జ్‌తోనే ఆలయంలోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారు అంబటి. అయితే తిరుమలలో రాజకీయ పార్టీల జెండాలు, బొమ్మలతో రావడం నిషేధం. కానీ ఈ రూల్‌ను పట్టించుకోకుండా మాజీ మంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే అంబటి విషయంలో భద్రతా సిబ్బంది కూడా చూసీచూడనట్టుగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్యాడ్జ్‌తోనే వైకుంఠం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని ఆయన దర్శించుకున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. తిరుమల కొండపై నియమ నిబంధనలు లెక్కచేయకుండా పార్టీ గుర్తుతో పాటు, జగన్‌ బొమ్మ ఉన్న బ్యాడ్జీని ధరించి మరీ అంబటి రాంబాబు శ్రీవారిని దర్శించుకోవడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అంబటిపై ఫిర్యాదు చేస్తాం: సీఎం రమేష్

మరోవైపు తిరుమలలో అంబటి రాంబాబు తీరుపై ఎంపీ సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు నిషేధం ఉన్నప్పటికీ అంబటి రాంబాబు పార్టీ గుర్తుతో పాటు జగన్ బొమ్మ ఉన్న బ్యాడ్జ్‌తో ఆలయంలోకి రావడం దారుణమన్నారు. అంబటికి భగవంతుడిపై నమ్మకం లేదన్నారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భగవంతుడు శిక్ష వేసినా వారికి భయం లేదని విమర్శించారు. ‘‘నేను హిందువును కాను.. నేను డిక్లరేషన్ ఇవ్వను.. తిరుమలకు రాను అని జగన్ చెబుతున్నాడు.. ఎంత ధైర్యం ఉంటే.. అంబటి జగన్ బొమ్మతో ఆలయంలోకి వస్తాడు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాడ్జీ కనపడకుండా అంబటి కండువా కప్పుకున్నారని.. ఆయనపై టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు.


శ్రీవారి సేవలో ప్రముఖులు..

మరోవైపు తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అనితకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. చంద్రబాబు, పవన్, కూటమి నేతలు బాగుండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు దర్శనానంతరం హోంమంత్రి మీడియాకు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు బాగుండాలని స్వామి వారిని వేడుకున్నానని అన్నారు. అలాగే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.


ఇవి కూడా చదవండి..

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్‌ యాప్‌..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 01:43 PM