Share News

YCP: నలుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:21 AM

పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె ప్రాజెక్టు ముంపు భూములకు పరిహారం ఇప్పించాలని పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి బాధిత రైతులు, ఎన్డీఏ కూటమి నేతలు విన్నవించాలని వెళ్లినపుడు జరిగిన దాడి కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

YCP: నలుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్‌

పుంగనూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె ప్రాజెక్టు ముంపు భూములకు పరిహారం ఇప్పించాలని పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి బాధిత రైతులు, ఎన్డీఏ కూటమి నేతలు విన్నవించాలని వెళ్లినపుడు జరిగిన దాడి కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. నేతిగుట్లపల్లె ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు గతంలో పరిహారం ఇస్తామని ఎంపీ హామీ ఇవ్వడంతో ఈ ఏడాది జూలై 17న విన్నవించడానికి కూటమి శ్రేణులతో కలిసి ఆయనవద్దకు వెళ్లారు. స్థానిక కొత్తఇండ్లులోని మాజీ ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప ఇంటివద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో రైతులు, కూటమి శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. పలువురు గాయపడ్డారని అప్పట్లో టీడీపీ మైనార్టీ నాయకుడు సయ్యద్‌ సుహేల్‌బాషా, ప్రసాద్‌స్వామి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లోని నిందితులైన నలుగురు వైసీపీ కార్యకర్తలను శనివారం అరెస్టు చేశారు. వీరిలో.. పుంగనూరు ఎన్‌ఎ్‌సపేటకు చెందిన షంషీర్‌బాషా కుమారుడు మహబూబ్‌బాషా(అమ్ముకుట్టి), రాతి మసీదువీధికి చెందిన నజీర్‌బాషా కుమారుడు ఇర్ఫాన్‌బాషా, ఎంబీటీ రోడ్డు సమీపంలో కాపురం ఉన్న ఫజులుద్దీన్‌ కుమారుడు ఎం.నిజాముద్దీన్‌, సుబేదార్‌ వీధికి చెందిన అన్వర్‌బాషా కుమారుడు సయ్యద్‌అయూబ్‌ ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితులను అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌జైలుకు తరలించినట్లు సీఐ వివరించారు.

Updated Date - Oct 21 , 2024 | 01:22 AM