Share News

TG News: ప్రిన్సిపాల్ భర్త లైంగిక వేధింపులు.. ఆ ప్రిన్సిపాల్ కూడా

ABN , Publish Date - Sep 03 , 2024 | 09:26 AM

Andhrapradesh: అన్నమయ్య జిల్లాలో ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. లక్కిరెడ్డిపల్లె అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ భర్త వేధింపులకు విద్యార్థినిలు వణికిపోతున్న పరిస్థితి. ఐదవతరగతి బాలికపై ప్రిన్స్‌పాల్ భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పాఠశాల ఆవరణలోనే క్వార్టర్స్‌లో ప్రిన్సిపల్ పరిమిళ కుటుంబం నివాసం ఉంటోంది.

TG News: ప్రిన్సిపాల్ భర్త లైంగిక వేధింపులు.. ఆ ప్రిన్సిపాల్ కూడా
Harassment by the principal husband

అన్నమయ్య జిల్లా, సెప్టెంబర్ 3: ఈమధ్య కాలంలో పాఠశాలల్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. పాఠాలు చెప్పాల్సిన గురువులు పాడుపనులకు పూనుకుంటున్నారు. స్కూళ్లల్లో కూడా ఆడబిడ్డలకు రక్షణ లేకపోతే ఎలా అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. స్కూల్ దశలోనే చిన్నారులు లైంగిక వేధింపులు ఎదుర్కుంటే అది వాళ్ల చదవు, భవిష్యత్తుపై దెబ్బపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కూళ్లలో ఎంత జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట కామాంధుడికి కొందరు విద్యార్థినిలు బలి కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నారు. గురువులే కాకుండా పాఠశాలలో ఉన్న కొంతమంది కూడా విద్యార్థినిల పట్ల అసభ్యకరరీతిలో ప్రవర్తించిన వార్తలు ఉన్నాయి.

Krishna Lanka Retaining Wall: రిటైనింగ్‌ వాల్‌ ఘనత ఎవరిది..?



ఇదీ విషయం...

తాజాగా అన్నమయ్య జిల్లాలో ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. లక్కిరెడ్డిపల్లె అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ భర్త వేధింపులకు విద్యార్థినిలు వణికిపోతున్న పరిస్థితి. ఐదవతరగతి బాలికపై ప్రిన్స్‌పాల్ భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పాఠశాల ఆవరణలోనే క్వార్టర్స్‌లో ప్రిన్సిపల్ పరిమిళ కుటుంబం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ప్రిన్స్ పాల్ భర్త బాల సుబ్బయ్య.. ఐదవ తరగతి బాలికను దగ్గరకు పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

నా జనం ఏమయ్యారు?


ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన బాలికలు ఆపై ఆందోళనలకు దిగారు. మొదట బయట ఎవరికి చెప్ప వద్దని బాలికలను ప్రిన్సిపల్ బెదిరింపులకు పాల్పడినట్లు విద్యార్థినిలు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ పాఠశాలను సందర్శించారు. ప్రిన్స్‌పాల్, ఆమె భర్త ఇరువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

Red Alert: తెలంగాణలో 15 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..

Vijayawada Floods: వరద తాకని రాజధాని!


Read Latest AP News And Telugu News

Updated Date - Sep 03 , 2024 | 11:27 AM