Share News

Dravidian: రాజకీయాలకతీతంగా ఉన్నత విద్య

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:18 AM

రాజకీయాలకు అతీతంగా ఉన్నత విద్యను కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ అన్నారు. ఆదివారం ద్రావిడ విశ్వవిద్యాలయం 27వ వ్యవస్థాపక దినోత్సవం అక్కడి ఆడిటోరియంలో ఘనంగా జరిగిరది.

Dravidian: రాజకీయాలకతీతంగా ఉన్నత విద్య
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ, అధ్యాపకులు

గుడుపల్లె, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలకు అతీతంగా ఉన్నత విద్యను కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ అన్నారు. ఆదివారం ద్రావిడ విశ్వవిద్యాలయం 27వ వ్యవస్థాపక దినోత్సవం అక్కడి ఆడిటోరియంలో ఘనంగా జరిగిరది. తొలుత వర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. వర్సిటీలో సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం ముందుందన్నారు. కొత్తగా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ కోర్సులు పెట్టడానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ సీఎస్‌ మునిరత్నం మాట్లాడుతూ.. వర్సిటీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కడా ప్రాజెక్టు డైరెక్టర్‌ వికాస్‌ మర్మత్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. వీసీ ఆచార్య దొరస్వామి మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల సహకారంతో ద్రావిడ భాషల పరిరక్షణకు విశ్వవిద్యాలయ కృషి చేయడం గొప్ప విషయమన్నారు. తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకుడు ఆచార్య మాడభూషి సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తులనాత్మక అధ్యయనాల ద్వారా సాంస్కృతిక అనుసంధానం సాధ్యమౌతుందని తెలిపారు. డీన్‌ ఆచార్య శ్యామల విశ్వవిద్యాలయం 27 సంవత్సరాల్లో జరిగిన ప్రగతిని వివరించారు.


రిజిస్ట్రార్‌ ఆచార్య కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఉద్యోగులు సహకరించాలన్నారు. అనంతరం డాక్టర్‌ దేవకి రచించిన గృహ వైద్యం, డాక్టర్‌ గణేష్‌ మూర్తి రచించిన తమిళ సాహిత్యం పుస్తకాలను అవిష్కరించారు. అంతకుముందు హరప్ప భవనంలో నూతన తరగతి గదులను ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్‌ బీఆర్‌ సురేష్‌ బాబు, పాలకమండలి సభ్యులు డాక్టర్‌ నిర్మల, కూటమి నాయకులు, అధ్యాపకులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 01:18 AM